Swiggy: మన దేశం లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో టాప్ 3 స్థానాల్లో ఉన్న యాప్స్ ఏమిటో చెప్పమంటే టక్కుమని మన అందరికి గుర్తుకు వచ్చే పేర్లలో ఒక్కటి స్విజీ యాప్..దేశం లో అత్యధిక మంది సిటిజన్లు ఈ యాప్ కి బాగా అలవాటు పడిపోయారు..ముఖ్యంగా సిటీస్ లో ఉండే వాళ్ళు ఈ యాప్ ని విపరీతంగా వాడుతారు..మనకి ఎలాంటి ఐటెం కావాలి అన్న ఈ యాప్ లో అందుబాటులో ఉంటుంది..దేశ వ్యాప్తంగా ఈ కంపెనీ క్రింద పని చేసే ఏజెంట్స్ కూడా లక్షల్లో ఉంటారు..కానీ ఇటీవల ఒక్క స్విగీ కస్టమర్ కి ఎదురు అయినా ఒక్క సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే బెంగళూరు లో ఒక్క కస్టమర్ తన క్రెడిట్ కార్డు ద్వారా స్విగీ లో కాఫీ ఆర్డర్ పెట్టాడు..సమయానికి స్విగీ డెలివరీ బాయ్ అందుబాటులో లెకపొయ్యేసరికి ఆ స్విగీ ఏజెంట్ కస్టమర్ కి ఐటెం డెలివరీ చెయ్యడానికి ‘దుంజో’ ఏజెంట్ ని బుక్ చేసుకున్నాడు.

.దుంజో కూడా స్విగీ లాంటి ఒక్క పెద్ద కంపెనీయే..ఇందులో కూరగాయల నుండి ప్రతి ఒక్క ఐటెం అందుబాటులోనే ఉంటుంది..కానీ స్విగీ లాంటి ప్రముఖ కంపెనీ లు కూడా దుంజో ఏజెంట్ అవసరం తీసుకుంది అంటే దుంజో కి ఉన్న ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవాలి అని సోషల్ మీడియా లో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనకు రంగులద్దాలని నేతల ప్రయత్నం?

స్విగీ లో కాఫీ ఆర్డర్ పెట్టిన ఆ కస్టమర్ తనకి ఎదురు అయినా ఈ అనుభవం ని ట్విట్టర్ లో వాట్స్యాప్ స్క్రీన్ షాట్ పెడుతూ ‘నేను స్విగీ లో కాఫీ ఆర్డర్ పెడితే దుంజో ఏజెంట్ నుండి ఫోన్ వచ్చింది ఏమిటి’ అంటూ ఆ కస్టమర్ ట్విట్టర్ లో దుంజో అకౌంట్ కి ట్యాగ్ చేసి అడగగా దానికి దుంజో సమాధానం చెప్తూ ‘బెంగళూరు లాంటి సూపర్ సిటీ లో సర్వీస్ ఫాస్ట్ గా జరగాలి అంటే ఒక్కే రంగం లో ఉన్న అందరం కలిసి పని చెయ్యాల్సిందే ‘ అంటూ వ్యగ్యంగా సమాధానం చెప్పాడు..ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ మరియు ఆ రిప్లై సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
Also Read:Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్