Jayamma Panchayathi Movie Review: రివ్యూ : జయమ్మ పంచాయితీ
దర్శకుడు: విజయ్ కుమార్ కలివరపు,
నటీనటులు: సుమ కనకళా, దేవి ప్రసాద్ ,దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్ తదితరులు.

నిర్మాతలు: బలగ ప్రకాష్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్
దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘జయమ్మ పంచాయతీ’. కాగా ఈ సినిమా ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.
Also Read: Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనకు రంగులద్దాలని నేతల ప్రయత్నం?
కథ:
జయమ్మ (సుమ) గౌరీ నాయుడు (దేవి ప్రసాద్) భార్య భర్తలు. తమ పిల్లలతో కలిసి ఓ చిన్న గ్రామంలో ఎంతో సంతోషంగా ఉంటారు. గొప్ప కోసం వీరిద్దరూ తమ బంధువులు మరియు తమ గ్రామంలోని ప్రజల ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరిగిన ఈడ్లు (చదివింపులు) తాహత్తుకి మించి ఇస్తూ ఉంటారు. దాంతో.. పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోతారు. అయితే, జయమ్మ భర్త (దేవి ప్రసాద్)కు అకస్మాత్తుగా గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. జయమ్మకు బాగా డబ్బు అవసరం అవుతుంది. ఎవరూ సాయం చేయరు. మరీ డబ్బు కోసం జయమ్మ ఏమి చేసింది ? గతంలో తాను అందరికీ చదివించిన ఈడ్లు కోసం ఆమె ఏమి చేసింది ? తన సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి వచ్చిన జయమ్మకి చివరకు మిగిలింది ఏమిటి ? అనేది మిగిలిన కథ
విశ్లేషణ :
గ్రామీణ నేపథ్యంలో కథ రాసుకోవాలని ఆలోచించడమే మంచి పరిణామం. అయితే, ఆ ఆలోచన అయితే బాగుంది గానీ, కథలో విషయం లేదు. ఎందుకో అరుదైన నేపథ్యం అయినప్పటికీ.. కథలో ఇటు కామెడీ లేదు, అటు బలమైన భావోద్వేగాలు లేవు. దాంతో జరుగుతున్న డ్రామా అంతా ఎలాంటి ఇన్ వాల్వ్ లేకుండా సింపుల్ గా ముందుకు పోతూ ఉంటుంది. పైగా గ్రామీణ నేపథ్యాన్ని తెరపైకి పక్కాగా తీసుకురావడంలో కూడా మేకర్స్ ఫెయిల్ అయ్యారు. సుమ నటన బాగుంది. అలాగే దేవి ప్రసాద్ నటన కూడా చాలా సహజంగా ఉంది. అసలు సున్నితమైన కామెడీలో ఉత్కంఠ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఆలోచించుకో లేక పోవడం విచిత్రం.

ఏది ఏమైనా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించకపోయింది. కాకపోతే కథలోని కొన్ని అంశాలు హృదయాల్ని కాస్త బరువెక్కిస్తాయి. కాకపోతే, ఆ బరువు ఎంతోసేపు ఉండదు. దాంతో సినిమాకి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
జయమ్మ పంచాయితీ సినిమా చాలా స్లోగా బోరింగ్ గా సాగుతూ.. ఎక్కడ టర్నింగ్ పాయింట్ కూడా లేకుండా.. సింగిల్ ప్లాట్ తోనే సినిమా మొత్తం సాగడం.. మొత్తమ్మీద ఈ సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు. అసలు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో సినిమా చివరి వరకు ఉంటే ఎలా నచ్చుతుంది ? బలమైన సంఘర్షణతో సాగాల్సిన పాత్రలు నిస్సహాయతతో సాగితే ఆ పాత్రలు ఎప్పటికీ ఎవరికీ కనెక్ట్ కావు. జయమ్మ పంచాయితీకి జరిగింది అదే.
ప్లస్ పాయింట్స్ :
సుమ నటన
మెయిన్ కథాంశం,
నేపథ్య సంగీతం,
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ ప్లే,
రొటీన్ డ్రామా,
లాజిక్స్ మిస్ అవ్వడం,
స్లో సాగే ట్రీట్మెంట్,
ఇంట్రెస్ట్ లేని సీన్స్,
సినిమా చూడాలా ? వద్దా ?
డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షకులకు ఈ సినిమా అసలు కనెక్ట్ కాదు. కాబట్టి, ఈ సినిమా చూడక్కర్లేదు.
రేటింగ్ : 2
Also Read:Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్