Hot Water Bath: మనలో చాలా మంది వేడి నీటితోనే స్నానం చేస్తారు. అది చలికాలమైనా ఏ కాలమైనా వేడి నీరు లేనిదే అసలు స్నానానికి దిగరు. శీతాకాలంలో అయితే నీళ్లు బాగా వేడి చేసుకుని మరీ స్నానానికి ఉపక్రమిస్తారు. పొగలు కక్కే నీటిని శరీరంపై పోసుకుని హమ్మయ్య అనుకుంటారు. కానీ వేడి నీటి స్నానంతో మనకు ఇబ్బందులు వస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. వేడి నీటితో స్నానం ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. కాలమేదైనా వేడి నీరే తమకు బాగుంటుందని అందరు వాటిని ఆశ్రయిస్తున్నారు.

వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం సున్నితత్వం కోల్పోతోంది. చర్మం పొడిబారి పోతుంది. వేడి నీళ్లు వాడొద్దని సూచిస్తున్నా లెక్కచేయడం లేదు. ఫలితంగా చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల సహజ నూనెల గుణాన్ని తొలగిస్తుంది. ముఖంపై మొటిమలు కూడా ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా ఎవరు కూడా వేడి నీటి స్నానం మానడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేడి నీళ్లు దూరం చేస్తే మనకు ఉపశమనం లభించడం ఖాయం.
చన్నీళ్లతో స్నానం చేస్తే చర్మానికి రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చలి నీటిలో స్నానం చేయడం వల్ల మన శరీరం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేడినీళ్లతో స్నానం చేస్తే రక్తప్రసరణ మందగిస్తుంది. జుట్టు కూడా పెరుగుదల జరగదు. ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి. దీంతో చన్నీటితోనే స్నానం చేయడం సురక్షితం. ఇవి ఎవరు కూడా పాటించడం లేదు. వైద్యులు చెప్పిన దాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా వేడి నీటితోనే స్నానం ముగిస్తున్నారు.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు వేధిస్తాయి. తామర వంటి చర్మ సంబంధ సమస్యలు అధికమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నష్టాలు వస్తాయని తెలిసినా వేడి నీటితోనే స్నానాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ చన్నీటితో స్నానం చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నందున ఇక మీదనైనా వేడి నీటికి బదులు చల్లని నీటితోనే స్నానం చేసి శారీరక రుగ్మతలు తగ్గించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.