Viral Video: గణపతి నవరాత్రి వేడుకలలో భాగంగా స్వామివారి నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా స్వామివారిని గంగమ్మ సన్నిధికి పంపిస్తున్నారు. గణపతి నిమజ్జనాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. నిమజ్జనం సందర్భంగా డప్పు చప్పులతో.. డ్యాన్సులతో సందడి చేస్తారు. ఇటీవల కాలంలో గణపతి నవరాత్రి ముగింపు వేడుకలు విభిన్నంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. అంతకుమించి అనే రేంజ్ లో వేడుకలు నిర్వహిస్తూ తమ సత్తా ఏమిటో నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఈ తరహా వీడియోలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో మాత్రం పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ఇప్పటికే వేలాది వీక్షణలు సొంతం చేసుకుంది. ఇక కామెంట్లు అయితే చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఓ ప్రాంతంలో వినాయకుడి నిమజ్జనం జరుపుతున్నారు. ఇందులో భాగంగా బ్యాండ్ మేళంతో స్వామివారికి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపులో భాగంగా స్థానికంగా ఉన్నవారు డ్యాన్సులు వేస్తున్నారు. అయితే ఓ అంకుల్ డాన్స్ వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాకపోతే విపరీతంగా పెరిగిన పొట్ట డ్యాన్స్ వేయడంలో అంతరాయాన్ని కలిగిస్తోంది. దీంతో డాన్స్ వేయడానికి అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తన లోపాన్ని ఎదుటివారి మీద పెట్టడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. బ్యాండ్ కొట్టే వ్యక్తిని ఇంకా ఇంకా కొట్టాలంటూ రెచ్చగొడుతున్నాడు.. అప్పటివరకు ఓపికతో చూసిన ఆ బ్యాండ్ మేళం వ్యక్తి.. ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయాడు. అంతే డాన్స్ వేస్తున్న అంకుల్ కు బ్యాండ్ ఇచ్చి.. నువ్వే కొట్టుకో అన్నట్టుగా సంకేతం ఇచ్చాడు. దీంతో ఆ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు. ఏ ప్రాంతంలో చోటు చేసుకుందో తెలియదు. కాకపోతే ఇది సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది..” అతడికి డ్యాన్స్ వేసే సీన్ లేదు. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటే.. బ్యాండ్ కొట్టే యువకుడిని రెచ్చగొట్టాడు. అప్పటిదాకా సహనంతో ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఓపికను కోల్పోయాడు. దీంతో బ్యాండ్ అతడి చేతికి ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక పరుగుపెట్టాడు. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.. సోషల్ మీడియా వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram