Rajasekhar And Sridevi: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన నటుడు రాజశేఖర్… మొదట అడపదడప చిన్నచిన్న క్యారెక్టర్ లను చేస్తూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకు మనుగడ లేదని గమనించిన రాజశేఖర్ వెంటనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి నటించిన ఆరాధన సినిమాలో ఒక క్యారెక్టర్ లో కనిపించాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడంతో సోలో హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం కూడా బాగుండడంతో రాజశేఖర్ టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇదే సమయంలో శ్రీదేవి సైతం టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడం విశేషం… మరి ఇదిలా ఉంటే శ్రీదేవి వాళ్ళ నాన్న, రాజశేఖర్ వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్స్ కావడం విశేషం. ఇక మొదటి నుంచి ఈ రెండు ఫ్యామిలీలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. దానివల్ల వీళ్ళు తరచుగా కలుసుకుంటూ ఉండేవారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇటు రాజశేఖర్ హీరోగా ఉండటం, అటు శ్రీదేవి హీరోయిన్గా రాణిస్తూ ఉండడం వల్ల శ్రీదేవి వాళ్ళ నాన్న రాజశేఖర్ వాళ్ళ నాన్నతో శ్రీదేవిని రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పారట. దానికి రాజశేఖర్ వాళ్ళ నాన్న మాత్రం ఒప్పుకోలేదట. కారణం ఏంటి అంటే తనకు కోడలుగా వచ్చే అమ్మాయి హీరోయిన్ అయి ఉండకూడదని ఆయన ఒక కండిషన్ అయితే పెట్టుకున్నాడు.
ఇక అదే విషయాన్ని రాజశేఖర్ కి కూడా చెప్పారట. అప్పటికే రాజశేఖర్ శ్రీదేవిని ఇష్టపడుతున్నప్పటికి వాళ్ల నాన్న కోరిక మేరకు శ్రీదేవిని మర్చిపోతానని చెప్పి, సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేశాడు. మరి మొత్తానికైతే శ్రీదేవి సైతం మొదట రాజశేఖర్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట.
కానీ ఈ కండిషన్స్ విన్న తర్వాత ఆమె కూడా రాజశేఖర్ మీద పెద్దగా ఆసక్తిని చూపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ శ్రీదేవి మంచి కాంబినేషన్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండేదని రాజశేఖర్ అభిమానులు సైతం అప్పట్లో వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు… ఇక మొత్తానికైతే రాజశేఖర్ శ్రీదేవి పెళ్లి కాకుండా ఆపింది రాజశేఖర్ వాళ్ళ నాన్న కావడం, అలాగే వీళ్ళ పెళ్లికి తనే విలన్ గా మారాడని చాలామంది చెబుతూ ఉంటారు…