నందమూరి నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా టైంలో సీనియర్ హీరోల సినిమాలన్నీ పట్టాలెక్కేందుకు ఇబ్బందిపడుతుంటే బాలయ్య మాత్రం తన స్టైల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ను దసరా కానుకగా తీసుకొచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేయబోతున్నాడు.
Also Read: బిగ్ బాస్ షో గుట్టు విప్పిన కుమార్ సాయి..?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ ‘నర్తనశాల’కు స్వీయ దర్శకత్వం చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ‘నర్తనశాల’ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కాగా ఈ సినిమాను 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు స్వయంగా బాలకృష్ణ ప్రకటించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ తన తండ్రిలాగే పౌరాణిక సినిమాలు చేసేందుకు ఎప్పుడు ఇంట్రెస్టు చూపుతుంటాడు. బాలయ్య ఇప్పటికే పలు జానపద, పౌరణిక సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఎంతో ఇష్టంతో ‘నర్తనశాల’ మూవీలో నటిస్తూ దర్శకత్వం వహించాడు.
‘నర్తనశాల’ మూవీలో బాలకృష్ణ అర్జునుడిగా .. దివంగత నటి సౌందర్య ద్రౌపదిగా.. దివంగత నటుడు శ్రీహరి భీముడిగా.. శరత్ బాబు ధర్మరాజుగా నటించారు. అప్పట్లో తెరకెక్కించిన ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలన్నీ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Also Read: ఆ హీరోయిన్ వద్దంటూ త్రివిక్రమ్ కు దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..?
శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లలో ‘నర్తనశాల’ మూవీని రిలీజ్ చేయనున్నారు. 17నిమిషాల నిడివితో ఉన్న సన్నివేశాలతో ‘నర్తనశాల’ను అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మూవీ ద్వారా వసూలైన డబ్బుల్లో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఉపయోగించనున్నట్లు బాలకృష్ణ తెలిపాడు.