https://oktelugu.com/

ఓటీటీల్లో హిట్టు సినిమాలు వచ్చేసినట్టేనా?

కరోనా ఎఫెక్ట్ తో అత్యధికంగా లాభం పొందిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఓటీటీనే. థియేటర్లు మూతపడటం ఓటీటీలకు బాగా కలిసొచ్చింది. చిన్న సినిమాలకు మాత్రమే ఓటీటీలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచివే. ప్రస్తుత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాల నిర్మాతలు సైతం ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. Also Read: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నర్తనశాల తెరపైకి..! దీంతో ఓటీటీల్లో చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అన్ని కొత్త […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 10:35 AM IST
    Follow us on

    కరోనా ఎఫెక్ట్ తో అత్యధికంగా లాభం పొందిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఓటీటీనే. థియేటర్లు మూతపడటం ఓటీటీలకు బాగా కలిసొచ్చింది. చిన్న సినిమాలకు మాత్రమే ఓటీటీలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచివే. ప్రస్తుత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాల నిర్మాతలు సైతం ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

    Also Read: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నర్తనశాల తెరపైకి..!

    దీంతో ఓటీటీల్లో చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నారు. దీంతో ఓటీటీకి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఇటీవలీ కాలంలో ఓటీటీల్లో రిలీజవుతున్న ప్రతీ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో ఓటీటీ నిర్వాహాకులతోపాటు ప్రేక్షకులు సైతం ఆందోళన చెందుతున్నారు.

    కరోనా టైంలో ఓటీటీలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాలు భారీ ఎత్తున రిలీజయ్యాయి. అయితే వీటిలో ఒకటి అర మినహా దాదాపు అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజైతే ప్లాప్ కావడం ఖాయమనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది.

    టాలీవుడ్ నుంచి కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. నాని నటించిన ‘వి’.. అనుష్క నటించిన ‘నిశబ్ధం’ మూవీలు భారీ బడ్జెట్లో తెరకెక్కాయి. ఈ మూవీలను ఓటీటీల్లో రిలీజ్ చేయగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. వీటితోపాటు రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగాడు’.. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

    ఈ నేపథ్యంలో దసరాకు మరో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో ఒకటి పెద్ద సినిమాకాగా.. మరొకటి చిన్నసినిమా. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు ముందే మంచి టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ చిత్రాలు ఓటీటీల్లో హిట్టు కొడుతాయని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. వీటిలో మొదటగా ‘కలర్ ఫొటో’ చిత్రం అంటే అక్టోబర్ 23న రిలీజ్ కానుండగా.. ‘ఆకాశమే నీ హద్దురా’ 30న ఓటీటీలో రాబోతుంది.

    Also Read: బిగ్ బాస్ షో గుట్టు విప్పిన కుమార్ సాయి..?

    కలర్ ఫొటోలో కమెడియన్ సుహాన్ హీరోగా పరిచయం అవుతుండగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్.. పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈ దక్షిణాదిలో భారీ హిట్టు కొట్టడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఈ రెండు చిత్రాల విడుదలతోనైనా ఓటీటీల్లోని సినిమాలు హిట్టు బాటపడుతాయా? లేక పాత సీన్నే రిపీట్ చేస్తాయా? అనేది వేచిచూడాల్సిందే..!