Homeట్రెండింగ్ న్యూస్Atrocity In Anantapur: బాలికపై ఖాకీ కామ పిశాచీ దారుణం.. ఏం చేశాడంటే?

Atrocity In Anantapur: బాలికపై ఖాకీ కామ పిశాచీ దారుణం.. ఏం చేశాడంటే?

Atrocity In Anantapur: రక్షక భటుడే.. భక్షించే రాక్షసుడయ్యాడు. ఆలనా పాలనా చూసుకుంటానని ఓ బాలికను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.. పోలీస్‌ కదా.. రక్షణ ఉంటుందని ఆ బాలిక కూడా నమ్మి వెంట వచ్చింది. కానీ, చివరికి ఆమెపైనే కన్నేశాడా ఖాకీ.. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.. అబార్షన్‌ చేయించాడు.. విషయం బయటకు చెబితే చంపుతానని వేధించాడు. చివరకు బాధితురాలు ఖాకీ కబంధహస్తాల నుంచి బయట పడింది.

పాపను చూసుకోవాలని తీసుకొచ్చి..
తన పాప ఆలనాపాలన చూసేందుకు ఓ బాలికను తీసుకొచ్చి… ఇంట్లో పెట్టుకుని, చివరికి ఆమెపైనే కన్నేశాడో కానిస్టేబుల్‌. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురంలో జరిగింది. చివరకు కటకటాల పాలయ్యాడు. గుత్తి ప్రాంతానికి చెందిన వై.రమేశ్‌ కానిస్టేబుల్‌. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భార్యతో కలిసి అనంతపురంలో ఉంటున్నారు. వీరికి ఓ పాప ఉంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడంతో పాప బాగోగులు చూసుకోవడానికి గుత్తి ప్రాంతానికే చెందిన ఓ బాలికను రెండున్నరేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకున్నారు. పాపను చూసుకుంటూనే బాలిక ఇంటి పనుల్నీ చేసేది.

నమ్మి వస్తే.. నయవంచన..
క్రమంగా బాలికపై ఖాకీ కామాంధుడి కన్ను పడింది. భార్య విధులకు వెళ్లినప్పుడు.. తాను ఇంట్లో ఉండి.. బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆరు నెలలుగా అత్యాచారం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో 3 నెలల కిందట అబార్షన్‌ చేయించాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఈ క్రమంలో లాఠీతో కొడుతూ… గొంతుకు వైరు బిగించి హింసించేవాడు.

తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి..
రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక భరించలేకపోయింది. ఇన్నాళ్లూ చేసిన అకృత్యాలను ఇటీవలే తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాకీ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు చేసి కటకటాలకు పంపించారు.

బాలికపై ఏంట్రా..
బాధ్యతాయుతమైన పోలీస్‌ విధుల్లో ఉంటూ బాలికపై అత్యాచారం చేయడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాడితో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ అని పేర్కొంటున్నారు. ఇటీవలే వైజాగ్‌లో ఓ స్వామీజీ ఇలాగే బాలికై అకృత్యానికి పాల్పడ్డాడు. కాళ్లకు గొలుసులు కట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తెగింపుతో ఇటీవలే కటకటాలపాలయ్యాడు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. దిశ పోలీసులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నా అకృత్యాలు ఆగడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version