Tadipatri CI Death : తాడిపత్రి సీఐ ఆత్మహత్య వెనుక జేసీ ప్రభాకరరెడ్డి..వీడియో హల్ చల్

టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Written By: Dharma, Updated On : July 7, 2023 10:55 am
Follow us on

Tadipatri CI Death : తాడిపత్రి సీఐ ఆనందరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీస్ శాఖ చెబుతుండగా.. రాజకీయ ఒత్తిళ్లతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు చనిపోయారని ఆరోపించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  అప్పటి నుంచి టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు సెడన్ గా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. తెగ వైరల్ అవుతోంది. సీఐ ఆనందరావును జేసీ ప్రభాకరరెడ్డి దుర్భాషలాడుతూ తోసివేస్తున్నట్టు వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైసీపీ శ్రేణులు దీనిని వైరల్ చేస్తున్నాయి. పోస్టులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నాయి. సీఐ ఆనందరావు ఆత్మహత్య బాధ్యుడు జేసీ ప్రభాకరరెడ్డేనని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చనిపోయిన తరువాత రాజకీయ ఒత్తిళ్లు అంటూ ప్రభాకరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ఉద్దేశపూర్వకంగా అన్నట్టు అనుమానాలు కలిగేలా ఈ వీడియోలు ఉండడం విశేషం. టీడీపీ శ్రేణులు మాత్రం ఎప్పుడో పాత వీడియోలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన సమయంలో తీసినవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే జేసీ ప్రభాకరరెడ్డి ఆరోపణలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు.  సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని.. కుటుంబ కలహాలతో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.