Watermelon On Fridge: ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది. ఎండలు ముదిరాయి. ఈ నేపథ్యంలో దాహం అధికంగా వేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాటి నుంచి రక్షించుకునేందుకు కొన్ని మార్గాలు అన్వేషిస్తుంటాం. ఎండాకాలంలో మనకు కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. పండ్లలో పుచ్చకాయకు ఉన్న ప్రాధాన్యం ఎంతో ఉంది. ఇందులో నీటిశాతం ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. తద్వారా వడదెబ్బ తగలకుండా చేస్తుంది.
పుచ్చకాయ తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం మన శరీరానికి మేలు చేస్తుంది. ఇలా పుచ్చకాయ తినడం వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కానీ పుచ్చకాయను ఎలా తినాలి? కొందరు ఫ్రిజ్ లో పెట్టుకుని తింటారు. ఇది కరెక్టు కాదు. పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అందుకే పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టకూడదు. పుచ్చకాయ కోసిన వెంటనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకా బ్యాక్టీరియా పెరిగి అందులోని పోషక విలువలు నశిస్తాయి. అందుకే పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టుకోవడం అంత మంచిది కాదు.
పుచ్చకాయ తినడం వల్ల మన ఒంట్లో తగినంత నీరు లభిస్తుంది. దీంతో ఎండాకాలంలో వడదెబ్బ సోకే ప్రమాదం నుంచి బయట పడొచ్చు. బరువు తగ్గించుకోవాలనుకునే వారు కూడా పుచ్చకాయ తినడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీల శక్తి ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటుంది. దీని వల్ల కడుపులో పేగులకు రక్షణగా నిలుస్తుంది. ఇలా పుచ్చకాయ తినడం వల్ల మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుంది.
