Online Scams: దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మేం ఫలాలా అంటూ మన నెంబర్లు తెలుసుకుని మన ఖాతాల్లోంచి డబ్బులు మాయం అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనికి చదువుకున్న వారు చదువుకోని అందరు బలయ్యారు. దీనిపై పోలీసు శాఖ ప్రజలను ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అయినా కొందరు డబ్బు మీద ఆశతో తమకు డబ్బులు వస్తాయనే ఆశతో తమ వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తున్నారు.
దీంతో ఆగంతకుడు మన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం చకాచకా జరుగుతున్నాయి. ఇంకా ఇటీవల కాలంలో విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. వాటిని గుర్తించి లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి మనల్ని బురిడీ కొట్టించడం మామూలే. దీంతో మనం అతడికి దొరికిపోయి మన ఖాతాలోని డబ్బులు పోవడానికి కారకులం అవుతాం.
మోసాలను మొగ్గలోనే తుంచాలి. వారి పన్నాగాన్ని వారికే కొట్టాలి. మనం జాగ్రత్తగా ఉంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్ ను సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయకుండా ఉండటమే శ్రేయస్కరం. మన అకౌంట్లో డబ్బులు పోకుండా ఉండాలంటే మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ను మనం అటాక్ చేస్తే నష్టాలు మనకే.
దేశంలో కొన్ని దోపిడీ ముఠాలు సంచరిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా తిరుగుతున్నాయి. దీంతో వాటి నుంచి ఎదురయ్యే ముప్పును ముందే పసిగడితే నష్టం ఉండదు. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మోసగాళ్ల వలలో పడొద్దని సూచిస్తున్నారు.
Recommended Video: