Intestine Cleansing Foods: ఇటీవల కాలంలో ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అనారోగ్యం దరి చేరుతూనే ఉంది. ఆధునిక ఆహార అలవాట్లు అలా మారాయి. మాంసాహారం లేనిదే తినడం లేదు. బేకరి ఫుడ్స్ విపరీతంగా వాడుతున్నారు. దీంతో సమస్యలు వస్తున్నాయి. నూరేళ్లు హాయిగా బతకాల్సిన అవయవాలు పాతికేళ్లకే పాడైపోతున్నాయి. దీనికి కారణం మన చర్యలే. మనకు ఉన్న దురలవాట్లే ప్రతికూలంగా మారుతున్నాయి.
రోజుకో యాపిల్ తినండి డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. యాపిల్ లో ఉండే పోషకాల వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అరటిపండులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్లు, ఫొలేట్ వంటి పోషకాల వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
పియర్స్ లో ప్రిబయోటెక్ ఫైబర్ ఉండటం వల్ల ఇది బ్యాక్టీరియాను మెరుగు పరుస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పేగుల్లో కదలికలు తీసుకొస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి చేస్తుంది. దీన్ని తరుచుగా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవకాడో కూడా మనకు మంచి ఆహారమే. దీన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో ఉన్న మలినాలు బయటకు పోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
స్ట్రాబెర్రీలో కూడా ఔషధాలు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియాను పెరిేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేసతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. ఇలా వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి విముక్తులం కావచ్చు. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. వారంతా వీటిని తీసుకుని తమ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.