Prostitution On AP: తానొకరికి పండై.. ఒళ్లు పుండై
తాను ఎడారి అయి వేరొకరికి సెలయేరై
తాను పశువై మరొకరికి వశమై
ఇలా వేశ్యా జీవితాలపై అలిశెట్టి ప్రభాకర్ వారి గురించి ఎన్నో విధాలుగా కవితలు రాశారు. వేశ్య వృత్తి అంత సరదాగా ఉండేదేమీ కాదు. ఒక్కొక్కరు పెట్టే చిత్రహింసలు చూస్తుంటే ఈ వృత్తిలోకి ఎందుకొచ్చాంరా దేవుడా అంటూ వారు నిరంతరం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ వేరే దారి లేక ఆ జీవితాన్ని కొనసాగించేందుకు ముందుకు వెళతారు. ఇలా వేశ్యల జీవితాలు మీద మెరుగు లోపల పురుగు పట్టినట్టుగా కనిపించడం మామూలే. వారిని కదిలిస్తే వారి అంతరంగమే చెరువులా మారుతుంది.

వ్యభిచార వృత్తి ఆంధ్రప్రదేశ్ లో విస్తరిస్తోంది. విలాసాలకు అలవాటు పడిన వారు చాలా మంది ఈ వృత్తిలోకి మారుతున్నారు. 18-40 ఏళ్ల మధ్య వయసు వారే ఈ వృత్తిలోకి వెళ్తున్నారు. ఫలితంగా ఎయిడ్స్ లాంటి మహమ్మారి బారిన పడుతున్నారు. మహారాష్ట్రంలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షలు, ఏపీలో 2.09 లక్షలతో దేశంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది. ఇలా వ్యభిచార వృత్తిలోకి మారి తమ జీవితాలను గుల్ల చేసుకుంటున్నారు. అవగాహన, చైతన్యం లేకనే ఆడవారు పడుపు వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. పది నుంచి పదిహేను శాతం మంది కొత్తగా ఈ పనిని నమ్ముకుంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
వ్యభిచార కార్మికులు ఏపీలోనే అధికంగా ఉన్నారు. ఏపీలో 1.33 లక్షల మంది ఉన్నారని ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ వెల్లడిస్తోది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనే ఈ వృత్తి చేసే వారు ఉన్నట్లు చెబుతున్నారు. రాయలసీమలో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి జాతీయ రహదారులు ఉండటంతో వీరి నివాసం పెరుగుతోంది. వేశ్యల్లో 1450 మందికి ఎయిడ్స్ సోకినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అయినా వారు ఈ వృత్తి మానడం లేదు. మహారాష్ట్రలో 59,785, ఢిల్లీలో 46,786, మిజోరాంలో 833 మంది ఈ వృత్తిని అక్కడి వారు కొనసాగిస్తున్నారు. అరికట్టే వారు లేక రోజురోజుకు విస్తరిస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలస వచ్చి చాలా మంది పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారు. 11,639 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారు. ఒడిశా, చత్తీస్ గడ్, అసోం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటున్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ కూడా కొందరు పడుపు వృత్తిని చేపడుతున్నారు. మహారాష్ట్రకు వలస వెళ్లి కూడా అక్కడే స్థిరపడుతున్నారు. ఇలాంటి వారు మహారాష్ట్రలో 6.06 లక్షలు ఉన్నారు గుజరాత్ లో 2.08, ఢిల్లీలో 1.85 లక్షల మంది ఇలా చేస్తున్నారని ఆధారాలు వెల్లడిస్తున్నాయి.

2021 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య జరిగిన ఓ అధ్యయనంలో దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 8.25 లక్షల మంది వేశ్యలు ఉన్నట్లు తేలింది. ఇందులో 1.33 లక్షల మందితో ఏపీ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్ష మంది, తమిళనాడులో 65 వేల మంది చొప్పున ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో 65 వేల మంది పడుపు వృత్తి వారు ఉంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2022 నాటికి ఈ సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సరైన ఉపాధి లేక జీవన్మరణ సమస్య అయినా దానికే మొగ్గు చూపుతున్నారు. గత్యంతరం లేక పడుపు వృత్తినే నమ్ముకుంటున్నారు. కుటుంబ భారం కోసం తమ జీవితాలను శల్యం చేసుకుంటున్నారు. తప్పని తెలిసినా తప్పని పరిస్థితి. ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిసినా దానికే వంత పాడుతున్నారు. ఫలితంగా జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. ఈ వృత్తిని మాన్పించి వారికి సరైన బతుకుదెరువు చూపించి వారిని కూడా మంచి దారిలో నడిపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.