సూపర్ ఫోటో.. తాబేలుపై వినాయకుడు!

ప్రతి సంవత్సరం వినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉండే సందడి అంతాఇంతా కాదు. పండుగకు ముందు రెండు రోజుల నుంచి నిమజ్జనం వరకు మండపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించేవాళ్లు. అయితే ఎవరూ ఊహించని విధంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రభావం గణనాథునిపై పడింది. ఇంట్లోనే ఉండి గణేషునికి పూజలు నిర్వహించే పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్లల్లోనే ప్రతిష్టిస్తున్న విగ్రహాల విషయంలో కొందరు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 23, 2020 4:29 pm
Follow us on

ప్రతి సంవత్సరం వినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉండే సందడి అంతాఇంతా కాదు. పండుగకు ముందు రెండు రోజుల నుంచి నిమజ్జనం వరకు మండపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించేవాళ్లు. అయితే ఎవరూ ఊహించని విధంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రభావం గణనాథునిపై పడింది. ఇంట్లోనే ఉండి గణేషునికి పూజలు నిర్వహించే పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్లల్లోనే ప్రతిష్టిస్తున్న విగ్రహాల విషయంలో కొందరు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో ఒక భక్తుడు వినాయకుని విగ్రహాన్ని వెరైటీగా అలంకరించి పూజలు నిర్వహించాడు. వివిధ రూపాల్లో, అనేక ఆకృతుల్లో తయారు చేసే వినాయకునికి సంబంధించిన అవతారాలలో కూర్మావతారం ఒకటి. మోత్కూర్ కు చెందిన రఘువర్ధన్ జంతు ప్రేమికుడు కావడంతో గణనాథుడిని తాబేలుపై ప్రతిష్టించాడు. తాబేలుపై ఉన్న గణనాథుడు చూడముచ్చటగా ఉన్నాడు.

స్థానికంగా ఉండే ప్రజలు ఆ గణనాథుడిని చూసి తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాబేలుపై గణనాథుడు ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాబేలుపై గణనాథుడిని ఏర్పాటు చేసిన రఘువర్ధన్ తెలివిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంట్లో అటూఇటు తిరుగుతున్న తాబేలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ముచ్చట గొలుపుతున్నాయి. ఈ విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో హల్చల్ చేస్తున్నాయి.