https://oktelugu.com/

ఫోటోలకు లైకులు రాలేదని యువతి ఆత్మహత్య!

ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్ లే లోకంగా గడిపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఫోన్ ఛార్జింగ్ లో ఉంచిన సమయంలో సైతం అడిక్ట్ కావడం వల్ల ఫోన్ ను వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. నిపుణులు మాత్రం సోషల్ మీడియా వినియోగం ఎంత పెరిగితే మానసిక సమస్యలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 24, 2020 7:49 am
    Follow us on

    ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్ లే లోకంగా గడిపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఫోన్ ఛార్జింగ్ లో ఉంచిన సమయంలో సైతం అడిక్ట్ కావడం వల్ల ఫోన్ ను వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు.

    నిపుణులు మాత్రం సోషల్ మీడియా వినియోగం ఎంత పెరిగితే మానసిక సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెబుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌లోని లాంచెస్టర్‌లో ఫేస్ బుక్ కు బానిసైన యువతి తాను పెట్టిన పోస్టులకు లైకులు రావడం లేదనే చిన్న కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే 19 ఏళ్ల క్లోయె డేవిసన్ చాలా రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా పోలీసులకు ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

    అయితే పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఆమె స్నేహితులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చూడటానికి అందంగా ఉండే క్లోయె చదువుకుంటూ హోటల్ లో పార్ట్ టైం జాబ్ చేసేది. తరచూ ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసేది. అయితే వాటికి పెద్దగా లైకులు రాకపోవడంతో ఆమె కలత చెందింది. దీంతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది. అసలు నిజం తెలియడంతో పోలీసులు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని… వాళ్ల సోషల్ మీడియా వినియోగం గురించి దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు