Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra Tweet: "ఈ_ వాహనాలు".. ఆనంద్ మహీంద్రా మదిని దోచాయి

Anand Mahindra Tweet: “ఈ_ వాహనాలు”.. ఆనంద్ మహీంద్రా మదిని దోచాయి

Anand Mahindra Tweet: పెట్రోల్ ధర పెరిగిపోతోంది. డీజిల్ ధర చుక్కలనంటుతోంది. పైగా ఇంధనం అనేది తరిగి పోయే వనరు కాబట్టి ఎప్పటికైనా కూడా ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే. వాహనాలు లేకుండా మనుషుల మనుగడ సాగడం అసాధ్యం. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు తెరపైకి వచ్చాయి. అమెరికాలో టెస్లా అనే కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లమీద రయ్యి మంటూ పరుగులు తీస్తున్నాయి. ఆ కంపెనీ మనదేశంలో కూడా ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక మన దేశంలో ఆటోమొబైల్ దిగ్గజమైన మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రవేశించింది. ఇప్పటికే అగ్రికల్చర్ విభాగంలో తిరుగులేని స్థానంలో ఉన్న మహీంద్రా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది. అయితే ఆ కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రా తన ఉత్పత్తులను విభిన్నంగా మార్కెట్ చేసుకుంటారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటారు. సమాజంలో విభిన్నమైన వ్యక్తులను, వారు చేసిన పనులను వినూత్న విధానంలో ప్రచారం చేసే ఆనంద్ మహీంద్రా.. తన కంపెనీ ఉత్పత్తులను జనాలకు చేరువ చేసేందుకు అదే విధానాన్ని అవలంబిస్తారు.

పర్యావరణహితం

మహీంద్రా కంపెనీ.. గత కొంతకాలంగా “మహీంద్రా లాస్ట్” లో భారీగా పెట్టుబడులు పెడుతున్నది. ఇందులో ఎందుకు ఆ స్థాయిలో పెట్టుబడులు పెడుతుందో మొదట్లో చెప్పలేదు. కానీ తీరా అర్థమైంది ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నదని. పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలామంది ఇతర వాహనాల వైపు మల్లుతున్నారు.. మరోవైపు భవిష్యత్తు కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలదే పై చేయి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పదే పదే చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా వెలుగొందాలని ఆనంద్ మహీంద్రా భావించారు. అందులో భాగంగానే మహీంద్ర లాస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, లాస్ట్ మైల్ మొబిలిటీ 3,4 వీలర్ల మిశ్రమంతో ప్యాసింజర్, కార్గో వాహనాలను తయారుచేస్తున్నది. అయితే ఈ కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం రోడ్లమీద చక్కర్లు కొడుతున్నాయి.

బహుళ ప్రయోజనాలు

మహీంద్రా లాస్ట్ తయారుచేసిన వాహనాలు కేవలం ద్విచక్ర శ్రేణి మాత్రమే కాదు. త్రి, నాలుగు చక్రాల వాహనాలను కూడా ఇందులో రూపొందిస్తున్నారు. అయితే అవన్నీ కూడా ఎలక్ట్రిక్ విభాగానికి చెందినవి కావడం విశేషం. వీటిని ఇటీవలే మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఉత్తర భారతంలోని ప్రధాన నగరాల్లో కొంతమంది వ్యాపారులు మహీంద్రా కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల్లో కాఫీ షాపులు, మొబైల్ హోటల్స్, చాట్, బేల్ పూరి అమ్మే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం చార్జింగ్ ద్వారా మాత్రమే ఈ వాహనాలు నడుస్తాయి కాబట్టి.. ఆ వీధి వ్యాపారులకు పెద్దగా ఇంధనం వాడాల్సిన అవసరం ఉండదు.. పైగా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ ఫోటోలను “మహీంద్ర లాస్ట్” విభాగంలో పనిచేసే సుమన్ మిశ్రా అనే మహిళా అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “మహీంద్రా లాస్ట్ తయారు చేసే ఈ_ త్రి చక్ర వాహనాలు పర్యావరణ సహితంగా ఉంటున్నాయి. వీధి వ్యాపారులకు అండగా ఉంటున్నాయి. ఇది మా సంస్థ వేసిన ముందడుగు” అంటూ రాసుకు వచ్చారు. ఈ చిత్రాలను చూసిన ఆనంద్ మహీంద్రా వెంటనే రీ ట్వీట్ చేశారు. ” మా సంస్థ నుంచి వచ్చిన వాహనాలు నర్సరీ, కాఫీ షాప్, మొబైల్ షాప్..ఇలా రకాలైన బహుముఖ పనులు చేస్తున్నాయి. పర్యావరణ సహితంగా ఉంటున్నాయి. ” అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మహీంద్రా లాస్ట్ తయారుచేసిన ఈ ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తులను చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. అమెరికాకు టెస్లా ఉంటే.. ఇండియాకు మహీంద్రా ఉందని కితాబు ఇస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version