https://oktelugu.com/

Brazil: భార్యను అందాల పోటీకి పంపించాడు.. ఓడిపోయిందని అందరి ముందే అలా చేశాడు!

ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుంచి∙తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్‌ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 31, 2023 / 10:29 AM IST
    Follow us on

    Brazil: తన భార్య చాలా అందంగా ఉంటుందని మురిసిపోయే ఓ భర్త.. ఆమెను అందాల పోటీకి పంపించాలనుకున్నాడు. భార్యకు నచ్చజెప్పి పంపించాడు. అయితే వివిధ దశలను దాటుకుని ఫైనల్‌కు చేరిన భార్యను చూసి సంబర పడ్డాడు. ఇక అందాల కిరీటం తన భార్యతే అనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఫైనల్‌లో ఆమె ఓడిపోయింది. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అందరూ చూస్తుండగానే బరితెగించాడు. విజేతకు ధరింపజేసే అందాల కిరీటాన్ని లాక్కుని నేలకేసి బలంగా విసిరికొట్టాడు. అందాల భామ నెత్తిన ఒదిగిపోవాల్సిన ఆ కిరీటం ముక్కలైపోయింది.

    విజయంపై నమ్మకంతో..
    బ్రెజిల్‌లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్‌ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలామంది అందగత్తెలు ఈ పోటీల్లో హొయలొలికించారు. రౌండ్ల వారీగా పోటీదారులను జల్లెడ పట్టగా, విజేతను ప్రకటించే సమయానికి పోటీలో చివరికి నథాలీ బెకర్, ఇమాన్యులీ బెలి అనే ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో వీరిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో కిరీటాన్ని చేత్తో పట్టుకుని విజేతకు ధరింపజేసే క్రమంలో న్యాయ నిర్ణేత కొంత డ్రామా నడిపించింది.

    తన భార్యకు దక్కదేమో అని..
    ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుంచి∙తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్‌ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు.

    ఓటమిని తట్టుకోలేకపోయా..
    న్యాయనిర్ణేతలు నిర్ణయం సరైనది కాదని.. తన భార్యే ఈ పోటీల్లో గెలిచిందని, కానీ చివర్లో విజేతను తారుమారు చేస్తున్నారని అనిపించి ఆలా చేశానని నథాలీ బేకర్‌ భర్త వివరించాడు. అనంతరం ఈ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ.. అందాల పోటీ ముగింపు దశలో ఇలా జరగడం విచారకరమని, తమ నిర్ణయం సరైనదేనని చెప్పి ఇమాన్యులీ బెలినిని మిస్‌ గే బ్రెజిల్‌ 2023 విజేతగా ప్రకటించారు.

    Tags