Junior NTR: గత ఏడాది టాలీవుడ్ గడ్డుకాలం లో ఉన్న సమయం లో తన ‘బింబిసారా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కాసుల కనకవర్షం కురిపించి టాలీవడ్ కి పూర్వ వైభవం తెచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అనే చిత్రం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు..కొత్త రకమైన సబ్జక్ట్స్ చెయ్యడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరోసారి కొత్త తరహా కథాంశం తో మన ముందుకి వచ్చాడు.

ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడబోతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు..ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ కోసం ఆయన సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని వేదికగా చేసుకొని ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అప్డేట్ చెప్పమంటూ ఎన్టీఆర్ స్పీచ్ సమయం లో గోల చేసారు..అప్పుడు ఎన్టీఆర్ దానికి చిరాకుగా సమాధానం చెప్తూ ‘మేము ఏదైనా పర్ఫెక్ట్ గా ఫుల్ ఫోకస్ తో పనులు పూర్తి చేసి అంతా సిద్ధం అన్న తర్వాతే ఏ సినిమాకైనా అప్డేట్ ఇస్తాము, దయచేసి దర్శకుడిపై నిర్మాతపై ఒత్తిడి పెంచకండి.

వాళ్ళ పనులను వాళ్ళను సక్రమంగా చేసుకోనివ్వండి,మీరు ఇలా ఊరికే ఒత్తిడి చేస్తే వాళ్ళు ఆ ఒత్తిడి ని తట్టుకోలేక ఎదో ఒక అప్డేట్ ఇచ్చేస్తారు.అప్పుడు మీరు కూడా సంతృప్తి చెందలేరు..మంచి అకేషన్ చూసి చెపుదామని అనుకుంటూ ఉన్నాను..ఏదైనా మా సినిమా అప్డేట్ ఉంటే నా భార్య కంటే ముందుగా మీకే చెప్తాను..ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది..ఈ నెలలోనే ముహూర్తపు కార్యక్రమాలు పూర్తి చేసి, వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తాము..ఏప్రిల్ 5 2024 వ తారీఖున విడుదల చేస్తాము’ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు ఎన్టీఆర్.