Suhaas : ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులతో ఒకరు ‘సుహాస్’.యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ , సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ రోల్స్ లో నటిస్తూ హీరో గా ‘కలర్ ఫోటో’ వంటి జాతీయ అవార్డుని గెలుపొందిన చిత్రంలో నటించి విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు..కేవలం కమెడియన్ మరియు హీరో రోల్స్ మాత్రమే కాదు , నెగటివ్ రోల్ లో కూడా మెప్పించగలను అని గత ఏడాది చివర్లో విడుదలైన అడవి శేష్ ‘హిట్ 2 ‘ ద్వారా నిరూపించుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాలో హీరోగా నటించి పెద్ద హిట్ కొట్టేసాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం తో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.ఆ విధంగా హీరోగా నటించి రెండు సక్సెస్ లను అందుకున్న సుహాస్ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం.

-బాల్యం/కెరీర్ :
సుహాస్ 1990వ సంవత్సరం ఆగష్టు 19వ తారీఖున విజయవాడ లో జన్మించాడు..అతని విద్యాబ్యాసం మొత్తం అక్కడే జరిగింది.విజయవాడ లోని KBN డిగ్రీ కాలేజీ లో డిగ్రీ పట్టా పొందాడు.ఇక ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ సినిమా మీద ఉన్న పిచ్చి కారణంగా ఎలా అయిన నటుడు అవ్వాలనే తపన తో ఇండస్ట్రీ కి వచ్చాడు..బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వస్తే ఎలా ఉంటుందో తెలిసిందేగా, సినిమాల్లో నటించాలనే కళతో బంగారం లాంటి కెరీర్ ని వదులుకొని అవకాశాలు లేక ఇప్పటికీ కృష్ణ నగర్ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు..సుహాస్ కూడా అలా అవకాశాల కోసం ఎన్నో కష్టాలను ఎదురుకున్నాడు..లెక్కలేనన్ని ఆడిషన్స్ కూడా చేసాడు కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు.
-షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం:
అలా కెరీర్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో సుహాస్ కి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘చాయ్ బిస్కట్’ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు..వాటిల్లో ‘ది అతిథి’ అనే షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయ్యింది,దీనితో సుహాస్ తాను కోరుకున్న ఫేమ్ అయితే బాగా దక్కింది, ఆ తర్వాత అదే ‘చాయ్ బిస్కట్’ ఛానల్ లో ‘కళాకారుడు’ అనే షార్ట్ ఫిలిం చేసాడు, ఇది కూడా బాగా క్లిక్ అయ్యింది.ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ బాగా హిట్ అవ్వడం తో సుహాస్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు.ఇతనిలో మంచి కామిక్ టైమింగ్ ఉందని గమనించిన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తాను శర్వానంద్ తో తీసిన ‘పడి పడి లేచేమనసు’ అనే చిత్రం లో ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు.సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆయనకి మంచి పేరైతే వచ్చింది..అలా ఒక పక్క షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో తనకి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా రెండిటిని బ్యాలన్స్ చేస్తూ వచ్చాడు.
-కీలక మలుపు :
అలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సుహాస్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’.ఈ సినిమాలో డిటెక్టివ్ గా చాలా చక్కగా నటించాడు సుహాస్..ఆయన క్యారక్టర్ కూడా బాగా క్లిక్ అయ్యింది.ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సుహాస్ గురుంచి ప్రత్యేకంగా ‘సుహాస్ మేక్స్ యాన్ ఇంప్రెసివ్ కామియో యాజ్ డిటెక్టివ్ బాబీ’ అని ఒక ఆర్టికల్ ప్రచురించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు సుహాస్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇక ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా నటించిన మజిలీ చిత్రం తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఈ సినిమా బాగా హిట్ అవ్వడం తో సుహాస్ ని అందరూ ‘మజిలీ సుహాస్’ అని పిలవడం ప్రారంభించారు.
ఇక అక్కడి నుండి సుహాస్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది..ఇప్పుడు అతగాడు ఏ స్థానం లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాము..సుహాస్ కి ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న డిమాండ్ ప్రకారం ఆయన ఒక్క రోజు కాల్ షీట్ రెండు లక్షల రూపాయలతో సమానం అని చెప్పొచ్చు..అదే హీరో గా అయితే 50 లక్షల రూపాయిల వరకు డిమాండ్ చేసే రేంజ్ కి ఎదిగాడట, ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఆయన రేంజ్ మరింత పెరిగింది..ఇలాగే విభిన్నమైన పాత్రలతో ముందుకు పోతే సుహాస్ కి కచ్చితంగా ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఆయన రేంజ్ ఎలా మారబోతుందో అనేది.