https://oktelugu.com/

తమిళ రాకర్స్ పైరసీ వైబ్ సైట్ ‘ఆట’కట్టించిన అమేజాన్

! ఆన్ లైన్లో సినిమాలు చూసే ప్రేక్షకులంతా తమిళ రాకర్స్ గురించి వినే ఉంటారు. కొత్త సినిమాలను పైరసీ చేసి తమిళ రాకర్స్ తన సబ్ స్కైబర్స్ కు అందించడంలో ముందుంటోంది. దీంతో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టోపోవాల్సి వచ్చేది. పైరసీ నివారణకు చిత్రపరిశ్రమ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ రాకర్స్ ను కట్టడి చేయలేకపోయింది. Also Read: ‘ఫైటర్’ కోసం బాలీవుడ్ నటుడు.. విజయ్ కు పోటీనా? కోలీవుడ్ సినిమాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 02:43 PM IST
    Follow us on

    !

    ఆన్ లైన్లో సినిమాలు చూసే ప్రేక్షకులంతా తమిళ రాకర్స్ గురించి వినే ఉంటారు. కొత్త సినిమాలను పైరసీ చేసి తమిళ రాకర్స్ తన సబ్ స్కైబర్స్ కు అందించడంలో ముందుంటోంది. దీంతో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టోపోవాల్సి వచ్చేది. పైరసీ నివారణకు చిత్రపరిశ్రమ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ రాకర్స్ ను కట్టడి చేయలేకపోయింది.

    Also Read: ‘ఫైటర్’ కోసం బాలీవుడ్ నటుడు.. విజయ్ కు పోటీనా?

    కోలీవుడ్ సినిమాలను పైరసీ చేయడంతో తమిళ రాకర్స్ టాప్ సైట్ గా పేరొందింది. ఈ సైట్ బ్లాక్ చేసేందుకు కోలీవుడ్ పరిశ్రమ ఎంతగా శ్రమించినా ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సైట్లో వచ్చే పైరసీ సినిమాల వల్ల కోలీవుడ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సినిమా రిలీజైన కొన్ని గంటల్లోనే తమిళ రాకర్స్ లో సినిమా ప్రత్యక్ష్యం అవడం ఈ సైట్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

    తమిళ రాకర్స్ పై కోలివుడ్ పరిశ్రమ ఎన్నోసార్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యున్నత స్థాయిలో నివారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ వెబ్ సైట్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే సైట్ పని చేయట్లేదనే సమాచారమే కనిపిస్తుంది. అయితే ఆ వెబ్ సైట్ ద్వారా పైరసీ సినిమాలు ఆగడం లేదు. కొన్నేళ్లుగా తమిళ రాకర్స్ తన సబ్‌స్క్రైబర్లను మెయిల్ ద్వారా పైరసీ లింకులు పంపిస్తూ ఎంగేజ్ చేస్తోంది.

    అయితే ఈ పైరసీ సైట్ వల్ల అమేజాన్ ప్రైమ్ కూడా పెద్దఎత్తున నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు సంస్థ ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్థాయిలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి డీల్ చేసింది. వీరంతా సదరు వెబ్ సైట్ సర్వీసులను బ్లాక్ చేయడంతో తమిళ రాకర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

    Also Read: కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!

    ఇప్పటివరకు పైరసీలకు అలవాటుపడిన తమిళ రాకర్స్ సబ్‌స్క్రైబర్లకు కొత్త సినిమా అప్డేట్స్ అందడం లేదని తెలుస్తోంది. ఈమేరకు తమిళ రాకర్స్ సైతం తన సర్వీసులన్నీ బ్లాక్ అయినట్లు తన సబ్‌స్క్రైబర్లకు మెయిల్ పంపుతున్నాయి. ఏదిఏమైనా కోలీవుడ్ చిత్రపరిశ్రమ చేయలేని పనిని అమేజాన్ ప్రైమ్ చేసి చూపించింది. దీంతో అమేజాన్ ప్రైమ్ పై పలువురు సెలబ్రెటీలు ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.