ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి డెవలప్‌మెంట్ పరిధి(టీయూడీఏ)లోకి వచ్చే మరో 13 మండలాలను కలుపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాను ‘తుడా’ పరిధిలోకి వచ్చే విధంగా బుధవారం ఆదేశాలు జారీయ అయ్యాయి. దీంతో తుడా పరిధిలోకి 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతం రానుంది. మొత్తంగా 4472 చదరపు కిలోమీటర్లతో టీయూడీఏ విస్తరించి ఉంది. అయితే వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో ఉన్న శ్రీసిటీ సెజ్ ఉన్న 11 గ్రామాలను మినహాయించింది.