Amaravati Re Launch: అమరావతి(Amaravathi) పునః ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా కాసేపటి క్రితమే మొదలైన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథి గా విచ్చేసి 57 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉపన్యాసాలు కాసేపటి క్రితమే మొదలయ్యాయి. అయితే సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అమరావతి రైతుల పోరాటాన్ని, వాళ్ళు పడిన కష్టాలను, సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ సహకారంతో మళ్ళీ రాజధాని నిర్మాణం ఎలా అధిగమించి ముందుకు వెళ్తున్నారు వంటి సందర్భాలను విశ్లేషిస్తూ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan KAlyan) సుదీర్ఘంగా పది నిమిషాల పాటు ఉపన్యాసం అందించాడు. అయితే మాట్లాడున్నంతసేపు పవన్ కళ్యాణ్ మధ్యలో దగ్గుతూ ఉన్నాడు.
ఇది గమనించిన ప్రధాని మోడీ ఉపన్యాసం అయ్యాక కూర్చున్న పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా దగ్గరకు పిలిచి ‘విక్స్’ ని చేతికి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని బట్టి పవన్ కళ్యాణ్, మోడీ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం లోనే అత్యంత పవర్ ఫుల్ గా పిలవబడే ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయ్యాడు అనేది అర్థం అవ్వడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకున్నారు. ఢిల్లీ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రధాని వేదిక పై ఆయనతో సరదాగా చాలాసేపు చర్చించాడు. ‘ఎప్పుడు కాషాయ వస్త్రాల్లోనే కనిపిస్తున్నావు ఏమిటి?, హిమాలయాలకు వెళ్ళిపోతున్నావా?’ అని అడిగారని పవన్ కళ్యాణ్ మీడియా తో అప్పట్లో చెప్పుకొచ్చాడు.
ఇలా ఎన్నో సందర్భాల్లో మోడీ పవన్ గురించి ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తున్నదంటే, కచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్ళబోతున్నాడా అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ pic.twitter.com/CGPqLaTcJA
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025