Prabhas and Deepika Padukone : మన ఇండియా లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone). ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పద్మావత్’ చిత్రం ఎంత పెద్దా సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే, కచ్చితంగా ఈమె బ్రాండ్ కారణంగా ఆ సినిమాకు అదనపు మార్కెట్ ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మని ఇచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆమె చివరిసారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘కల్కి 2898 AD’. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తర్వాత దీపికా పదుకొనే మరో సినిమాకు అంగీకారం తెలపలేదు.
Also Read ; ప్రభాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ప్రభాస్(Rebel Star Prabhas), సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సందీప్ వంగ అనేక చర్చలు జరిపాడు. అయితే ఈ క్యారక్టర్ కి దీపికా ని మించి ఎవ్వరూ న్యాయం చెయ్యలేరని భావించి ఆమెని సంప్రదించగా, క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఒప్పుకునే ముందే ఆమె ‘కల్కి 2’ చేయడానికి కూడా అంగీకారం తెలిపింది. మొదటి భాగంలో ప్రభాస్, దీపికా పదుకొనే మధ్య ఎక్కువ సన్నివేశాలు లేవు. కానీ రెండవ భాగంలో దీపికా పదుకొనే తో అత్యధిక సన్నివేశాలు ఉంటాయట. ఈ సంవత్సరం లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
మొత్తం మీద ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి అన్నమాట. సందీప్ వంగ సినిమాల్లో హీరో క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, హీరోయిన్ క్యారక్టర్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ క్యారక్టర్ చాలా బలమైనదట. ఆమె అనేకమైన యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తుందట. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది. ఇకపోతే ‘స్పిరిట్’ చిత్రం అత్యధిక శాతం మెక్సికో ప్రాంతం లోనే షూటింగ్ చేయబోతున్నారట. అందుకు సంబంధించిన లొకేషన్స్ ని కూడా ఇప్పటికే ఎంచుకొని పెట్టుకున్నాడు సందీప్ వంగ. ప్రభాస్ లాంటి కటౌట్ ని నూటికి నూరు శాతం వాడుకొని, ఎంత పవర్ ఫుల్ గా చూపించాలో, అంతే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ని ఈ చిత్రం లో చూపించబోతున్నాడట సందీప్ వంగ.
Also Read : మీడియా ముందుకు తొలిసారి దీపికా పదుకొనే కూతురు..త్వరలోనే విడుదల కాబోతున్న సెన్సేషనల్ వీడియో!