Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan- Allu Arjun : వైఎస్ జగన్ కు అల్లు అర్జున్ బర్త్ డే...

YS Jagan- Allu Arjun : వైఎస్ జగన్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్.. వైరల్

YS Jagan- Allu Arjun : మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ను నేతలు కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపుతున్నారు. కొన్నిచోట్ల అయితే పేదలకు అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతోపాటు ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జగన్కు పలువురు నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా బర్త్డే విషెస్ చెప్పారు. వైయస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

* ఆ ఫ్లెక్సీ ఎవరు పెట్టారు?
అయితే తాజాగా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే అది వైసిపి అభిమానులు పెట్టారా?లేకుంటేఅల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది. రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఏకమవుతారు అనే కొటేషన్ ను ఈ బ్యానర్ లో పొందుపరిచారు. ఈ ఫ్లెక్సీలో జగన్ తో పాటు అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టడం చేశారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కు వైసిపి అండగా నిలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో జగన్ సైతం దాన్ని ఖండించారు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించడంలో వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే అల్లు అర్జున్ అభిమానులు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

* మెగా కుటుంబానికి దగ్గర
అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో.. మెగా కుటుంబంతో సన్నిహితంగా గడిపారు అల్లు అర్జున్. ఆ సమయంలో అల్లు అర్జున్ కు అండగా నిలబడింది మెగా కుటుంబం. చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ పరామర్శించారు. అటు తరువాత అల్లు అర్జున్ చిరంజీవితో పాటు నాగబాబు నివాసానికి వచ్చారు. తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ పవన్ నుంచి అంత సానుకూలత రాలేదని తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ జన్మదినం నాడు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version