Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న పూణేలో ‘విశ్వగురువు భారత్’ అనే టాపిక్ మీద మాట్లాడారు. ఒక స్టేట్స్ మెన్ గా మాట్లాడారు. ‘రామాలయం మన విశ్వసానికి సంబంధించినది.. రామాలయ నిర్మాణం జరగాలని ప్రతి హిందువు కోరుకున్నాడు. కానీ ఆ పేరుతో మత విద్వేషాలు , శత్రుత్వం, కొత్త వివాదాలు, హిందువులను చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవడం మంచి పద్ధతి కాదు’ అని హితవు పలికారు. భారతీయ సంస్కృతి అన్ని మతాలను గౌరవిస్తుందని.. అందరూ కలిసి ఉండాలన్నది మన సంస్కృతి అని.. ప్రతి ఒక్కరూ తమ నమ్మిన సిద్ధాంతాలు పాటించే హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేశారు.
మైనార్టీలు ఆందోళన చెందాల్సింది మన దేశంలో కాదని.. మిగతా దేశంలో అని భగవత్ పేర్కొన్నారు. భారత్ లో మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంటుందని.. ఇతర మతాలు, దేవుళ్లను అవమానించడం మన సంస్కృతి కాదని స్పష్టం చేశారు.
మోహన్ భగవత్ మత సామరస్య పిలుపుని ఆహ్వానిద్దాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
