
Unstoppable Season 3: ‘ఆహా’ యాప్ లో ప్రసారమైన నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో ఆహా యాప్ ని టాప్ 10 ఇండియన్ ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిలబెట్టింది.
బాలయ్య ని సరికొత్త కోణంలో జనాలకు చూపిస్తూనే ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫన్నీ చిట్ చాట్స్ చేయించింది ఆహా. అయితే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 3 ఉంటుందా లేదా అని అనుకుంటున్నా ఫ్యాన్స్ కి రీసెంట్ గా ఒక్క పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఆహా మీడియా.అదేమిటంటే త్వరలోనే అల్లు అర్జున్ ఆహా యాప్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఆహా మీడియానే తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇన్ని రోజులు మీరు క్లాస్ మరియు మాస్ లుక్ లో చూసి ఉంటారు..కానీ ఈసారి బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా లోకి రాబోతున్నాడు’ అంటూ ఒక ట్వీట్ ద్వారా తెలియచేసింది ఆహా టీం. సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 3 కి అల్లు అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడని, ఇక నుండి ఈ షో వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం ఇది ‘అన్ స్టాపబుల్’ షో కి సంబంధించినది కాదని, సరికొత్త గేమ్ షో అని అంటున్నారు.ఈ రెండు కాదు ఒక వెబ్ సిరీస్ ద్వారా అల్లు అర్జున్ మన ముందుకు రాబోతున్నాడు అంటూ మరో ప్రచారం కూడా అవుతుంది, అయితే వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే అని ఆహా మీడియా టీం చెప్తుంది.