
Chanakya Niti: భార్యాభర్తల బంధం కలకాలం నిలుస్తుంది. ఆలుమగల సంబంధంలో ఎన్నో విషయాలు మనకు స్ఫష్టమవుతాయి. పొద్దున గొడవ పెట్టుకుని సాయంత్రం సర్దుకుపోవడం వారికి సహజమే. ఇలా జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఇబ్బందులను వారు అధిగమిస్తారు. సంసారమనే నావ సక్రమంగా నడవడానికి ఇద్దరు సాయపడతారు. ఇలా వారి కాలచక్రమంలో ఎన్నో విషయాలు కలిసొస్తాయి. మరికొన్ని విషయాలు విభేదాలు పొడచూపుతాయి. అయినా వారి ప్రయాణం ఆగదు. నిరంతరం పరుగులు పెట్టాల్సిందే. పిల్లల ఎదుగుదలకు వారి జీవితాన్నే పణంగా పెడతారు. భార్య కోసం భర్త పతి కోసం పత్ని త్యాగాలు చేస్తుంటారు. కుటుంబ నిర్వహణలో వారి పాత్ర అనిర్వచనీయం.
అన్ని విషయాలు
ఆచార్య చాణక్యుడు ఆలుమగల బంధం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో భార్యకు చెప్పకూడని విషయాలు ఉంటాయని సూచించాడు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో భార్యతో చెప్పకూడదు. అలా చెబితే మన పరువు గంగలో కలిసినట్లే. అన్ని విషయాల్లో ఉన్నది ఉన్నట్లు చెబితే మనకు నష్టం కలుగుతుంది. అందుకే మనకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని జీవిత భాగస్వామితో షేర్ చేసుకోవడం మంచిది కాదు. కొన్నింటిని రహస్యంగా ఉంచకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
పొరపాటున కూడా..
భార్యలకు పొరపాటున కూడా అన్ని విషయాలు చెప్పకూడదు. జీవితంలో కట్టుకున్న భార్యలతో కూడా కొన్ని విషయాలు దాచాల్సిన అవసరం ఉంటుంది. భార్యలతో చెప్పకూడని విషయాలేంటో ఆచార్య చాణక్యుడు సూచించాడు. భర్త సంపాదించే ఆదాయం కూడా చెప్పకూడదు. ఒకవేళ చెబితే మన ఆదాయానికి తగిన విధంగా బడ్జెట్ వేసుకుని మనం పొదుపు చేయకుండా చేస్తుంది. అందుకే భార్యలకు మగవారి సంపాదన ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచుకోవడం సురక్షితం.

అవమానాల గురించి..
గతంలో మనకు జరిగిన అవమానాలను కూడా ఎప్పుడు భార్యలతో చర్చించకూడదు. అలా చేసినట్లయితే ఆమెకు మన మీద విలువ తగ్గిపోతుంది. మనల్ని లెక్క చేయదు. ఏది చెప్పినా మన అవమానాన్ని గుర్తు చేసి బ్లాక్ మెయిల్ కు దిగుతుంది. అందుకే ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భార్య ముందు మనకు సైతం అవమానం కలగడం కామన్. చాణక్యుడు సూచించిన విధంగా మనం జీవితంలో ఎదురయ్యే పరిణామాలను అందరితో పంచుకోవడం సమంజసం కాదని గుర్తుంచుకోవడం మంచిది.