Alien Romance With Humans: గ్రహాంతరవాసుల గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అసలు వారు ఉన్నారా? లేరా? అనేది సందేహమే. ఈ నేపథ్యంలో గ్రహాంతర వాసుల గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. మనుషుల్లాగే వారు కూడా గ్రహాంతరాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటారనేది వాదన. కానీ ఇంతవరకు వారిని చూసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ వారి ఉనికి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గ్రహాంతరవాసులు ఎలా ఉంటారు? వారి ఆకారం ఏమిటి అనే దానిపనై స్పష్టత లేదు.

గ్రహాంతరవాసులను ఏలియన్స్ అంటారు. వారు మనుషులతో కూడా సంబంధాలు పెట్టుకుంటారనే విషయం గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఏలియన్స్ ఉన్నారనే విషయం అది చెబుతోంది. గ్రహాంతర వాసులు మనుషులతో శృంగారం కూడా జరుపుతున్నారనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా ఎందుకు చెబుతోందనే దానిపై మాత్రం ఆధారాలు మాత్రం లేవు.
గ్రహాంతర వాసులతో ఓ మహిళ శృంగారంలో పాల్గొని గర్భం కూడా దాల్చినట్లు చెబుతోంది. దీంతో అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే వారి ఆకారం ఏమిటి? వారి ఉనికి ఎక్కడ? అనే విషయాలు అర్థం కావడం లేదు. గ్రహాంతరవాసుల గురించి వినడమే కానీ ఎప్పుడు కూడా చూడలేదని పలువురు పేర్కొంటున్నారు.

గ్రహాంతర వాసులను చూసిన వారికి పలు వ్యాధులు అంటుకున్నట్లు చెబుతున్నారు. జట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, పీడకలలు వంటి సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి గురించి మరోసారి చర్చనీయాంశం అవుతోంది. వారి మనుగడ గురించి పలు కథనాలు వస్తున్నాయి. అమెరికా వాసుల్లో కూడా గ్రహాంతర వాసులపై అనుమానాలున్నా ఇలా ఊహాగానాలు ప్రసారం చేయడంపై అందరిలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ గ్రహాంతర వాసుల రూపం ఎలా ఉంటుంది? వారికి ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది. వారి ఉనికి ఏ విధంగా ఉంటుందనే దానిపై అందరికి తెలుసుకోవాలనే ఉంది. వారి ఆవాసం ఎక్కడ అనే దానిపై కూడా ఇంతవరకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసుల ప్రస్తావన మరోసారి సంచలనం సృష్టిస్తోంది.