ఖతార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు ఆస్ట్రేలియా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. టెర్మినల్ బాత్రూంలో పిండం లభించడంతో 13 మంది ఆస్ట్రేలియా మహిళలను విమానంలో నుంచి కిందకు దించారు. ఖతార్ లోని దోహా ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాశ్రయ అధికారుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: నువ్వొక చెత్త ప్రోడక్ట్ అంటూ సీఎం మీద స్టార్ హీరోయిన్ చిందులు
దోహా విమానశ్రయ సిబ్బంది 13 మంది మహిళల జననాంగాలను పరిశీలించడం కోసం వాళ్లను విమానాశ్రయం నుంచి కిందికి దింపారు. అనంతరం మహిళల లోదుస్తులను కూడా తొలగించామని ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా కొందరు అధికారులు వికృత చర్యలకు పాల్పడ్డారు. అయితే మహిళలకు శిశువు గురించి కనీస సమాచారం కూడా అధికారులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఆస్ట్రేలియా స్థానికుల నుంచి ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటన గురించి ఖతార్ లోని దొహా ఎయిర్ పోర్ట్ అధికారులను వివరణ కోరింది. ఆస్ట్రేలియా అధికారులు త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటామని చెబుతున్నాయి. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తరువాత మహిళలు అధికారులకు ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు.
Also Read: చైనా దూకుడుకు కళ్లెం.! అమెరికాతో భారత్ సీక్రెట్ చర్చలు
విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఘటనలో ఖతార్ ప్రభుత్వంతో సంప్రదించి అసలేం జరిగింది…? ఎందుకు జరిగింది..? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటానికి గల కారణాలేమిటి..? అనే విషయాలను తెలుసుకోనుంది. ప్రభుత్వ వర్గాలు ఖతార్ ప్రభుత్వంతో కలిసి పని చేసి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.