Homeఅంతర్జాతీయంచైనా దూకుడుకు కళ్లెం.! అమెరికాతో భారత్‌ సీక్రెట్ చర్చలు

చైనా దూకుడుకు కళ్లెం.! అమెరికాతో భారత్‌ సీక్రెట్ చర్చలు

India-USA Defence Talks

సరిహద్దుల్లో సైలెంట్‌గా వికృత చేష్టలకు పాల్పడుతున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ ఇప్పటికే రక్షణశాఖను పటిష్టం చేసింది. అనేక ప్రయోగాలను చేపడుతూ యుద్ధం వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామంటూ క్షిపణిల ద్వారా తేల్చి చెబుతోంది. అయినా చైనా ఆగడాలు ఆపడం లేదు. స్నేహపూర్వక చర్చలంటూనే తమ ఆర్మీ బలగాలను లద్దాఖ్‌ వంటి ప్రాంతాల్లో మోపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే చైనా దూకుడును అరికట్టేందుకు భారత్‌, అమెరికా రక్షణ శాఖల చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఒప్పందాలు కుదిరితే రక్షణ శాఖ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది.

Also Read: మహిళలను వివస్త్రలను చేసిన విమానాశ్రయ అధికారులు.. ఎక్కడంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌లు భారత్‌కు రాబోతున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాంపియో ఏ దేశ పర్యటనకు వెళ్లలేదు. అన్నీ సమావేశాలు వర్చువల్‌ ద్వారానే సాగించారు. కానీ చర్చలో పాల్గొనేందుకు భారత్‌కు నేరుగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావడం చర్చనీయాంశంగా మారింది.

భారత్‌, అమెరికాలు ఉమ్మడిగా చైనాపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీలో ఫేస్‌టుఫేస్‌ చర్చలు నిర్వహించనున్నారు. రెండు దేశాల విదేశాంగ శాఖ, రక్షణశాఖ మంత్రులు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇందులో రక్షణపరమైన అంశాలు, విదేశాంగ విధానాలపై ఎక్కువగా చర్చిస్తారు. ఓవైపు కోవిడ్‌ను ప్రపంచానికి వదిలిన చైనా లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. దీంతో భారత్‌, అమెరికా ఈ విషయంపై సమన్వయం పెంచుకోవడం, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకోవడంపై చర్చిస్తారు.

భారత్‌, అమెరికాల మధ్య ఇప్పటికే లెమోవా, కోంకాసా అనే ఒప్పందాలున్నాయి. తాజాగా జరిగే చర్చల్లో ఒప్పందం కుదిరితే భారత్‌ రక్షణశాఖ పటిష్టం కానుంది. హిమాలయాల్లో చైనా సైనికులు చేరుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. దీంతో వారి కదలికను కనిపెట్టే స్పష్టమైన చిత్రాలు, వీడియోలు అమెరికా ద్వారా రహస్యంగా భారత్‌కు అందుతాయి. దీంతో భారత్‌ ముందగానే ప్రణాళికతో ఇండియన్‌ ఆర్మీని పంపి చైనాను తరిమేయొచ్చు. అమెరికాకు చెందిన రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తే వాటిని మెరుగ్గా వాడుకోవచ్చు.

Also Read: డూప్ భార్యతో ట్రంప్ ప్రచారం.. దుమారం

ఇటీవల అమెరికా సెక్రటరీ మైక్‌ పాంపియో మాట్లాడుతూ భారత్‌ సరిహద్దుల్లో దాదాపు 60 వేల మంది చైనా సైనికులు మోహరించారని ప్రకటించారు. ఇప్పుడు జరిగే ఒప్పందం కుదిరితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చైనా మాత్రం భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ‘అమెరికాకు టోక్యో భాగస్వామి కావచ్చు కానీ.. భారత్‌ కాదు’ అంటూ కామెంట్‌ చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version