Adipurush
Adipurush: ఆదిపురుష్ రిలీజ్ కావడంతో ఇండియా మొత్తం ప్రభాస్ అభిమానులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడిగా కొలిచే శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ని చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.
థియేటర్లలో హనుమంతుడు..
హనుమంతుడి కోసం ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ చేసిన కృషి ఫలించినట్లు ఉంది. రామాయణ పారాయణం జరిగే ప్రతీచోట హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే ఆదిపురుష్ ఆడే ప్రతీ థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించాలని దర్శకుడు ఓం రౌత్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో థియేటర్ల యజమానులను కోరారు. డిస్ట్రిబ్యూటర్లకు విన్నవించారు. ఈమేరకు అన్ని థియేటర్లలో ఓ సీటు ఖాళీగా ఉంచుతున్నారు. ఓంరౌత్ నమ్మకం నిజమవుతోంది. ఆదిపురుష్ చిత్రం రిలీజ్ రోజే ఓ థియేటర్‌లోకి వానరం(కోతి) ప్రవేశించింది. భక్తులు కోతిని హనుమంతుడి రూప గా భావిస్తారు. చిన్న ప్రదేశం ఉన్న వెంటిలేటర్ నుంచి ఆ కోతి ఆదిపురుష్ థియేటర్‌లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో బిగ్ స్క్రీన్‌పై శ్రీరాముడిగా ప్రభాస్ డైలాగ్ చెబుతున్నాడు.
మార్మోగుతున్న రామనామం..
థియేటర్లకు హనుమంతుడి రాకతోపాటు, శ్రీరాముడిగా ప్రభాస్ ఆహార్యాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. దీంతో ప్రభాస్ కనిపించిన ప్రతీసారి థియేటర్లలో జైశ్రీరాం నామం మార్మోగుతోంది. ఇన్నాళ్లూ రాముడు అంటే.. మీసాలు లేకుండా ఉండే ఆహార్యమే అందరిలో ఉండిపోయింది. ఆదిపురుష్ ద్వారా ప్రభాస్ కూడా ప్రతీ హిందువు గుండెలో శ్రీరాముడిగా ముద్రవేసుకుంటున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొన్ని క్యారెక్టర్లు కొందరి కోసమే..
థియేటర్లలో ప్రభాస్ కనిపించిన ప్రతీసారి వస్తున్న స్పందన చూసి దర్శకుడు ఓంరౌత్ కూడా స్పందించారు. బాహుబలి, ఆదిపురుష్ లాంటి కొన్ని కార్యరెక్టర్లు కొందరికోసమే ఉంటాయన్నారు. ఆ పాత్రల్లో ప్రభాస్‌ను తప్ప ఎవరూ ఊహించుకోలేమని పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని ప్రేక్షకులు క్రమగా అర్థం చేసుకుంటన్నారని అభిప్రాయపడ్డారు. ‘ఏది ఏమైనా తెరపై రాఘవను చిత్రీకరించడానికి ఒక నిర్దిష్ట అవగాహన, మనస్తత్వం అవసరం. ఈ లక్ష్యం ప్రభాస్ ద్వారా నెరవేరింది’ అని ఓంరౌత్ అభిప్రాయపడ్డాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Adipurushs screening monkey gets a surprise people are chanting jai shri ram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com