Sandeep Choreographer: టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ లో ఆట సందీప్ ఒకరు. ఓంకార్ యాంకర్ గా జీ తెలుగులో ప్రసారమైన ఆట రియాలిటీ షోతో పాపులర్ అయ్యాడు. పరిశ్రమలో డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నాడు. మనోడి చర్యలు కొంచెం భిన్నంగా ఉంటాయి. తాజాగా ఆట సందీప్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. పక్కన భార్య ఉండగానే మరొక యువతికి లిప్ కిస్సులు ఇచ్చాడు. పక్కనే భార్య జ్యోతి నొచ్చుకుంది. ఈ వీడియో చూసిన జనాలు వీడు సామాన్యుడు కాదంటున్నారు.
భార్య పక్కన ఉండగా పరాయి అమ్మాయితో ఫోన్ మాట్లాడటానికి భయపడే భర్తలు ఉన్న రోజుల్లో ఈయనేంటి ఏకంగా ముద్దులు లాగించేస్తున్నాడని వాపోతున్నారు. అదే సమయంలో ఒకింత విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదంతా ఓ చిత్ర ప్రమోషన్ లో భాగమని తెలుస్తుంది. ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ఆట సందీప్ భార్య ఉండగా మరొక అమ్మాయిని ప్రేమించడం తప్పుకాదన్నాడు. మనసు మాట వింటే తప్పేంటని కుండబద్దలు కొట్టాడు.
ఆట సందీప్ భార్య జ్యోతి పెద్దగా రియాక్ట్ కాలేదు. కాబట్టి ఇదంతా స్క్రిప్ట్ కావచ్చు. లేదంటే ఏ భర్త మాత్రం పెళ్ళాం ముందు రొమాన్స్ చేస్తాడు చెప్పండి. జ్యోతి కూడా డాన్సర్ కాగా ఆట సందీప్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఒక దశలో దారుణమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డట్లు ఆట సందీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పెళ్ళైన కొత్తలో చేతిలో డబ్బులు లేవు. పైగా బాబు పుట్టాడు. ఒకరోజు బైక్ లో పెట్రోల్ అయిపోతే జేబులో డబ్బులు లేవు, ఫోన్ లో బ్యాలన్స్ లేదు. అంతటి ఆర్థిక కష్టాలు చూశానని చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోగా సందీప్ స్పందించాడు. ఢీ లో ఒక పాట పర్ఫార్మ్ చేయడానికి కేవలం రూ. 30 వేలు ఇస్తారు. అందులో కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, ఇతర ఖర్చులు చూసుకోవాలి. ఆ డబ్బులు చాలక సాంగ్ బాగా రావడానికి కొరియోగ్రాఫర్స్ అప్పులు చేసి ఎదురు పెడతారు. దాని వలనే చైతన్య లాంటి వాళ్ళు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారని వెల్లడించారు.