Rashmika Mandanna: మొన్న పఠాన్ అనే సినిమా లో ” బే శరం” అని ఒక పాట విడుదలైంది. దేశం మొత్తం, చివరకు ఆ ముస్లిం సమాజం కూడా యాక్ థూ అని ముఖం మీద కాండ్రించి ఉమ్మింది..దెబ్బకు ఆ ఎస్ఆర్కే , యశ్ రాజ్ ఫిలింస్ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఏకంగా ఆ పాటనే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇలాంటి పాటలు శ్రీవల్లి అలియాస్ రష్మికకు రొమాంటిక్ గా అనిపిస్తున్నాయి. అదే సౌత్ సినిమాలో మాస్ మసాలా, ఐటెం పాటలు ఎక్కువ ఉంటాయని, సౌత్ కంటే హిందీ సినిమాలే ఎక్కువ అలరిస్తాయని ఈవిడ గారి ఉవాచ. ప్రస్తుతం ఈమె “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోంది.. ఇటీవల ఆ సినిమాకు సంబంధించి ఒక పాట కూడా విడుదలైంది.. ఈ సినిమాకు సంబంధించి ఏదో ప్రెస్ మీట్ లో తిక్క తిక్క వ్యాఖ్యలు చేసింది.. ఇప్పటికే తన నోటి తీటతో కన్నడ సమాజానికి దూరమైంది. రక్షిత్ శెట్టితో పెటాకులైన తన నిశ్చితార్ధానికి సంబంధించి… అతడి స్నేహితులను టార్గెట్ చేసింది.. తనకు లైఫ్ ఇచ్చిన ఆ కిరాక్ పార్టీ గ్యాంగ్ మీద అనేకసార్లు తన పైత్యాన్ని ప్రదర్శించింది.. మొన్న విడుదలైన కాంతారా సినిమా పైన ఏదో పిచ్చి పిచ్చి సైగలు చేసింది.. దీంతో అప్పటి నుంచే కన్నడ సమాజం ఆమెను డిస్ ఓన్ చేసుకోవడం ప్రారంభించింది. అదే కాదు తాను పుట్టిన మంగళూరు ప్రాంతంలోనూ ఆమె పట్ల నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు త్వరలో ఆమె తమిళ విజయ్ తో కలిసి నటించిన వారసుడు కన్నడలో విడుదల కాకుండా చూస్తే ఎలా ఉంటుందని చర్చ కూడా నడుస్తోంది.

సౌత్ వైపే చూస్తోంది
ఈ సంవత్సరం బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క హిందీ సినిమా ₹1000 కోట్లు కొల్లగొట్టిన దాఖలాలు లేవు.. అదే ఆర్ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 బాలీవుడ్ ను దున్నేశాయి.. విక్రమ్, కాంతారా, కార్తికేయ- 2 కొత్త రికార్డులు సృష్టించాయి.. అంతటి అమితాబచ్చన్ సౌత్ ను చూసి నేర్చుకోవాలని బాలీవుడ్ వాళ్లకి చురకలు అంటిస్తున్నాడు.. కానీ ఆ రష్మికకు ఇవేమీ కనిపించడం లేదు. ఆ మధ్య అదే అమితాబచ్చన్ తో రష్మిక నటించిన “గుడ్ బై ” అనే సినిమా విడుదలైంది.. కానీ వచ్చిన ఫాయిదా ఏమీ లేదు. ఇలా రెండు మూడు సినిమాలు ఎదురు తన్నితే మళ్ళీ దక్షిణాది పరిశ్రమే ఆమెకు దిక్కవుతుంది. అప్పుడు ఎలాగూ విజయ్ దేవరకొండ తో శోకాలు తప్పవు.. “మిషన్ మజ్ను” తో తనకు స్ట్రెయిట్ బ్రేక్ వస్తుందని రష్మిక నమ్ముతోంది.. కానీ ఇవి రేఖ, శ్రీదేవి, జయప్రద, హేమ రోజులు కావు. పాజిటివ్ కామెంట్ చేసినంత మాత్రాన హిందీ సమాజం అంతగా ఓన్ చేసుకోదు.

హిందీ మార్కెట్ కోసమేనా
ప్రస్తుతం రష్మిక చేతిలో వారసుడు, మిషన్ మజ్ను, సందీప్ రెడ్డి వంగా తీస్తున్న యానిమల్, పుష్ప_2 సినిమాలు ఉన్నాయి. కానీ ఇవేవీ తనకు సరిపోయేలా లేవు. ఎందుకంటే హిందీలో జెండా పాతాలి అంటే బలమైన సినిమాలు కావాలి. తన అడుగులు ఇంకా బలంగా పడాలి. అందుకే రష్మిక ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. కానీ గుడ్ బై సినిమా తర్వాత కేఆర్ కే ఫిలిం క్రిటిక్ రష్మిక లాగే తిక్క క్యారెక్టర్. వెంటనే ఆమె నటన,హవా భావాల పై ఓపెన్ అయ్యాడు. తను హిందీ సినిమాకు పనికిరాదని, భోజ్ పురి సినిమాలకు మాత్రం పనికొస్తుందని తేల్చి పడేశాడు. పాపం ఈ మాటలు రష్మికకు వినిపిస్తున్నాయో లేదో? అమ్మా క్రష్మిక..అల్ రెడీ నీ పుట్టిన గడ్డను దూరం చేసుకున్నావ్. లైఫ్ ఇచ్చిన సౌత్ సినిమానూ దూరం చేసుకోవాలని అనుకుంటున్నావా? నీ అవకాశాల కోసం సౌత్ సినిమాని తక్కువ చేసి చూపడం దేనికి? నువ్వు మంచి దానివి అనిపించుకోవడం కోసం సౌత్ సినిమాని చెడ్డగా చూపడం దేనికి? రేపు హిందీ సినిమా బయటికి నెట్టేస్తే.. నువ్వు రావాల్సింది సౌత్ సినిమాలోకే.. నీకు అర్థ మవుతోందా?