https://oktelugu.com/

Actress Pragathi : నటి ప్రగతి పరువాల జాతర… ఈ వయసులో ఆ ఫోజులేంటి బాబోయ్

సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. డాన్స్ వీడియోలు చేసి అవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేవారు. అనంతరం గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఫిట్నెస్ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు. ప్రగతి కఠిన వ్యాయామాలు చేస్తుంది. ఆ వీడియోలు చూస్తే ఆమె డెడికేషన్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఈ వయసులో నీకు అవసరమా అంటుంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2023 / 05:07 PM IST
    Follow us on

    Actress Pragathi : వయసు దేముంది ఆస్వాదించే మనసు ఉండాలి కానీ అంటుంది ప్రగతి. ఈ 47 ఏళ్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెండేళ్లుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నారు. ప్రగతి చిన్న వయసులోనే పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె హీరోయిన్ గా చేశారు. తమిళంలో ఆమె రెండు మూడు చిత్రాల్లో మెయిన్ లీడ్ రోల్స్ దక్కించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమైంది. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయింది. ప్రగతికి ఒక కూతురు కాగా అమ్మ వద్దే పెరుగుతుంది.

    ప్రగతి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానంటుంది. 2002లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. మహేష్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన బాబీ మూవీలో మహేష్ అమ్మ పాత్ర చేసింది. చెప్పాలంటే మహేష్, ప్రగతి వయసు దాదాపు ఒకటే. ముప్పై ఏళ్ళు నిండకుండానే ఆమె మదర్ రోల్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నారు. రెండు దశాబ్దాలుగా బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు.

    అనుకోకుండా ఆమె సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. డాన్స్ వీడియోలు చేసి అవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేవారు. అనంతరం గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఫిట్నెస్ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు. ప్రగతి కఠిన వ్యాయామాలు చేస్తుంది. ఆ వీడియోలు చూస్తే ఆమె డెడికేషన్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఈ వయసులో నీకు అవసరమా అంటుంటారు.

    ట్రోలర్స్ కి తనదైన శైలిలో సమాధానం చెబుతుంది ప్రగతి. వ్యాయామం నా ఆరోగ్యం కోసం చేస్తున్నాను. మీలాంటి పని లేని వాళ్ళ కామెంట్స్ పట్టించుకోను. వ్యాయామం నాకు ఇష్టమైన వ్యాపకం. ఎవరి కోసమో దానిని ఆపను అంటారు. తాజాగా పింక్ కోట్ ప్యాంటు ధరించి ప్రగతి ట్రెండీ లుక్ లో షాక్ ఇచ్చారు. ఐదు పదుల వయసులో ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ప్రగతి ఏమైనా గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.