ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఐసీసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈసారి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడంతో ఇక్కడున్న వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రపంచ కప్ కోసం భారత్ తో పాటు ఇతర దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. త్వరలో జరిగే ఆసియా కప్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో అర్హత సాధిస్తేనే ప్రపంచకప్ కు వెళ్తారు. ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలు అర్హత సాధించాయి. ఇక భారత్ లో నిర్వహించే ప్రపంచ కప్ కోసం స్టేడియాలు రెడీ అవుతున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని మ్యాచ్ లను నిర్వహిస్తారు. అయితే టీమిండియా ఆడే మ్యాచ్ హైదరాబాద్ లో ఒక్కటి కూడా లేకపోవడం నిరాశను కలిగిస్తోంది. అందుకు కారణం ఏంటంటే?
ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇవి 45 మ్యాచ్ లు ఆడుతాయి. ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచుల్లో పాల్గొంటుంది. అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభిస్తుంది. ఆ తరువాత అక్టోబర్ 15న పాకిస్తాన్ తో, నవంబర్ 15న ముంబై, 16న కోల్ కతాలో సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఉంటాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ను నిర్వహిస్తారు.
భారత్ లోని ప్రముఖ స్టేడియాలున్న అహ్మదాబాద్, పుణే, ముంబై, హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, కోల్ కతాలల్లో ఆడనున్నారు. హైదరాబాద్ మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తుంది. నగరంలోని ఉప్పల్ స్టేడింయంలో అక్టోబర్ 5న ఇంగ్లండ్ – న్యూజిలాండ్ ఆడనుంది. ఆ మరుసటి రోజు 6న పాకిస్తాన్, క్వాలిఫయిర్ 1తో పోటీ పడనుంది. చివరగా 12న పాకిస్తాన్ -క్వాలిఫయిర్ 2 జట్లు పోటీ పడుతాయి. దీంతో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్ లో కొనసాగడానికి ఆస్కారం లేదు.
అయితే టీమిండియా అక్టోబర్ 8న చెన్నై వేదికగా, 11న అప్ఘనిస్తాన్ తో ఢిల్లీలో ఆడుతుంది. ఆ తరువాత జరిగే మ్యాచ్ లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే అక్టోబర్ 12 తరువాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చు. ఈ తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యాకేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో మూడు మ్యాచ్ ల తరువాత మరో మ్యాచ్ కు అవకాశం ఇవ్వలేదు.