Actress Poorna: హీరోయిన్ పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం ముగిసింది. పూర్ణ సీమంతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తల్లైన పూర్ణ బేబీ బంప్ తో సరికొత్తగా దర్శనమిచ్చారు. ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు ముఖంలో కనిపిస్తున్న సంతోషం చెబుతుంది. ఇక అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. క్షేమంగా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆకాంక్షిస్తున్నారు.

పూర్ణ 2022లో వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లి రహస్యంగా జరిగింది. నిశ్చితార్థం అందరికీ తెలిసేలా చేసుకున్న పూర్ణ వివాహం మాత్రం గుట్టుగా కానిచ్చేసింది. ఎంగేజ్మెంట్ జరిగి నెలల గడుస్తున్నా పెళ్లి ప్రకటన రాకపోవడంతో క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు వినిపించాయి. బ్రేకప్ రూమర్స్ కి సోషల్ మీడియా పోస్ట్స్ తో పూర్ణ సమాధానం చెప్పారు. కాబోయే వాడితో ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి నాకు పెళ్ళైపోయిందని ప్రకటించారు.

జూన్ నెలలో దుబాయ్ లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం ముగిసింది. అనివార్య కారణాల వలన ఎవరికీ చెప్పలేదు. కేరళలో ఓ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. పూర్ణ కామెంట్స్ అందరి మైండ్స్ బ్లాక్ చేశాయి. పూర్ణ భర్త దుబాయ్ లో ఓ వ్యాపారవేత్త. ఆయనకు పలు బిజినెస్లు ఉన్నాయి. ఆయన పేరు షానిద్ అసిఫ్ అలీ. పూర్ణను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. పెళ్ళికి పూర్ణకు అత్యంత విలువైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇక పెళ్ళై ఏడాది గడవక ముందే పూర్ణ తల్లి అయ్యారు.

ఆ మధ్య పూర్ణ గర్భం దాల్చనంటూ సోషల్ మీడియా ప్రకటన చేశారు. తాజాగా ఆమె సీమంతం వేడుక జరుపుకున్నారు. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిమ్. కేరళకు చెందిన ముస్లిం అమ్మాయి. పూర్ణ తన స్క్రీన్ నేమ్. చాలా మంది ఆమెను హిందూ అనుకుంటారు. సీమటపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాల్లో పూర్ణ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఢీ డాన్స్ రియాలిటీ షో జడ్జిగా వ్యవహరించారు. తరచుగా టెలివిజన్ షోలు, ఈవెంట్స్ లో ఆమె పాల్గొంటున్నారు. వివాహం అనంతరం కూడా నటిగా కెరీర్ కొనసాగిస్తున్నారు.