
Vijayashanthi- Actor Suresh: నటుడు సురేష్ 80లలో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా వెలిగిపోయారు. 90వ దశకం వరకూ ఆయన హవా కొనసాగింది. తెలుగుతో సమానంగా తమిళంలో ఫేమ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో వందకు పైగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. గతంలో ఆయన అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ విజయశాంతితో ఎఫైర్ రూమర్స్, ఆపై విబేధాలపై నోరు విప్పారు. హోస్ట్ అలీ ‘ఒక పెద్ద హీరోయిన్ తో గొడవ, మాట్లాడుకోకుండానే సినిమాలు చేశారు, దాని గురించి చెప్తారా?’ అని అడిగారు.
సురేష్ అది జస్ట్ మిస్ అండర్స్టాండింగ్ అంటూ… విజయశాంతితో గొడవేంటో చెప్పుకొచ్చారు. తమిళంలో ఆమె నేను హీరో హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కింది. ఆ చిత్ర ప్రొడ్యూసర్ ఒక గాసిప్ పుట్టించారు. తన సినిమాకు ప్రచారం తెచ్చుకోవడం కోసం సురేష్, విజయశాంతి మధ్య నిజంగానే ఎఫైర్ ఉంది. త్వరలో పెళ్లి ప్రకటన కూడా చేయవచ్చని పుకారు లేపారు. అది కాస్తా మీడియాలో వచ్చింది. విజయశాంతి-సురేష్ మధ్య ఎఫైర్ అంటూ వార్తలు రాశారు.
అయితే ఆ నిర్మాతకు ఎఫైర్ నడుస్తుందని చెప్పింది విజయశాంతి టీమే అని నాకు తెలిసింది. అది నాకు కోపం తెప్పించింది. సడన్ గా విజయశాంతితో మాట్లాడటం మానేశాను. నేను మాట్లాడటం లేదని విజయశాంతి కూడా బెట్టుగా ఉన్నారు. అలా పదేళ్లు నడిచింది. మాట్లాడుకోకుండానే ఆరు సినిమాల్లో నటించాము. అయితే బాలకృష్ణ మూవీ షూటింగ్ కోసం విజయశాంతి ఊటీ వచ్చారు. అక్కడ నా సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అప్పుడు మాటలు కలిశాయి. అసలు మేము ఎందుకు మాట్లాడుకోవడం మానేశామనే కారణం కూడా మర్చిపోయాము.

తర్వాత ఇద్దరం గుర్తు చేసుకొని… చాలా సిల్లీ పాయింట్ అని నవ్వుకున్నాం అంటూ సురేష్, విజయశాంతితో గొడవపై స్పందించారు. అయితే సురేష్ ఎక్కడా విజయశాంతి పేరు ప్రస్తావించలేదు. కానీ ఆయన చెప్పిన డిటైల్స్ ప్రకారం ఆ హీరోయిన్ విజయశాంతినే. అలీ ఒక పెద్ద హీరోయిన్ అని సంబోధించింది ఆమె గురించే. విజయశాంతి దాదాపు రెండు దశాబ్దాలు స్టార్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలారు. లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందిన విజయశాంతి… లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఒక ఒరవడి సృష్టించారు. ఆమె నటించిన కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మా… చిత్రాల రికార్డ్స్ ఏ హీరోయిన్ చెరపలేనివి.