Foxconn- Telangana: తెలంగాణకు ‘ఫాక్స్‌ కాన్‌’ పెట్టుబడి.. లక్షల్లో ఉద్యోగాలు..!

Foxconn- Telangana: తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘ఫాక్స్‌ కాన్‌’ లక్ష ఉద్యోగాలు ఇచ్చేలా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. సంస్థ చైర్మన్‌ యంగ్‌ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. పదేళ్లలో లక్ష ఉద్యోగాలు.. తైవాన్‌ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 3, 2023 11:35 am
Follow us on

Foxconn- Telangana

Foxconn- Telangana: తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘ఫాక్స్‌ కాన్‌’ లక్ష ఉద్యోగాలు ఇచ్చేలా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. సంస్థ చైర్మన్‌ యంగ్‌ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది.

పదేళ్లలో లక్ష ఉద్యోగాలు..
తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌∙సంస్థ ప్రపంచంలో వినియోగమయ్యే సెల్‌ ఫోన్లలో అత్యధికం తయారు చేస్తుంది. యాపిల్‌ ఐ ఫోన్లను కూడా యాపిల్‌ సంస్థ ఫాక్స్‌ కాన్‌ ద్వారానే ఉత్పత్తి చేయిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాంట్లు పెట్టిన ఫాక్స్‌ కాన్‌.. తెలంగాణలో ఏ యే రంగాల్లో పెట్టుబడులు పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత వర్గాలు చెబుతున్నాయి. యంగ్‌ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్‌ కార్డును సీఎం కేసీఆర్‌ స్వయంగా యాంగ్‌ ల్యూకి అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీ–వర్క్స్‌ను ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌లూ ప్రారంభించారు. టీ వర్క్స్‌ ఏర్పాటుకు కూడా ఫాక్స్‌కాన్‌ తనవంతు సహకారం అందించింది. ఈ సంస్థ రాకతో పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Foxconn- Telangana

కొంగరకలాన్‌ లేదా దుండిగల్‌లో పరిశ్రమ
ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉంది. కొంగరకలాన్, దుండిగల్‌ ప్రాంతాల్లో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఆయా ప్రదేశాలను సంస్థ ప్రతినిధులు పరిశీలించారని, యాంకర్‌ ఇండస్ట్రీగా ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలు నెలకొల్పే ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్‌ కూడా ఏర్పాటు చేయనుంది.

Tags