John Cena: డబ్ల్యు డబ్ల్యు ఈ చూసే వాళ్లకు జాన్ సెనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడిగా పేరుపొందిన అతడు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు డబ్ల్యు డబ్ల్యు ఈ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. 17 సార్లు అతడు ఛాంపియన్. అయితే అటువంటి కండల వీరుడు తన కెరియర్ లో శనివారం రాత్రి చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో అతడు ఎలాగైనా గెలుస్తాడని అభిమానులు భావించారు. సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు. కానీ అభిమానులు ఊహించనిది రిగ్ లో చోటుచేసుకుంది.
23 సంవత్సరాలు పాటు డబ్ల్యు డబ్ల్యు ఈ లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతున్న జాన్ సెనా శనివారం రాత్రి తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో గెలుస్తాడని, ప్రత్యర్థి పై ముష్టి ఘాతాలు కురిపిస్తాడని అందరూ అనుకున్నారు.. కొంతమంది అభిమానులు అయితే బెట్టింగ్ లు కూడా కాశారు. అయితే రిగ్ లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా చోటుచేసుకుంది.. ఎందుకంటే జాన్ సెనా అభిమానులు ఊహించింది కాకుండా.. ఊహించనిది చోటుచేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో జాన్ సెనా ఓటమిపాలయ్యాడు.. తన కెరియర్ కు తగిన స్వాన్ సాంగ్ (హంస గీతం) లాగా భావించిన జాన్ సెనా ఊహించని పరాజయాన్ని ఎదుర్కొని అభిమానులకు గుండె కోతను మిగిల్చాడు.
జాన్ సెనా ప్రత్యర్ధులు కర్ట్ యాంగిల్, మార్క్ హెన్రీ, రాబ్ వాన్ డామ్, డబ్ల్యూ డబ్ల్యూ ఈ హాల్ ఆఫ్ ఫేమర్స్ మిచల్ మెక్కుల్, ట్రిష్ స్ట్రాటస్, ది రాక్, కేన్ వంటి వారు ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. వారంతా కూడా జాన్ సెనా కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మ్యాచ్ వాషింగ్టన్ డిసీ లోని క్యాపిటల్ వన్ అరీనా లో జరిగింది. రింగ్ లో గుంథర్ ప్రారంభం నుంచి జాన్ సెనా మీద పై చేయి సాధించాడు. మధ్య మధ్యలో జాన్ తన పంచ్ లతో అదరగొట్టినప్పటికీ స్లీపర్ లో లాక్ అయ్యాడు. చివరికి టాప్ అవుట్ కావడంతో సెనా చివరి మ్యాచ్ ఓటమితో ముగిసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జాన్ సెనా అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.