https://oktelugu.com/

UK: చనిపోయిన 40 నిమిషాల తర్వాత బతికిన ఓ మహిళ.. అసలేమైందో చెప్పి షాకిచ్చింది

యూకే లోని నార్త్ యార్క్ షైర్ లో ఓ ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. క్రిస్ట్రీ బార్తో ఫాట్ అనే వివాహిత తన భర్త స్టూతో కలిసి లగ్జరీ నైట్ కు ప్లాన్ చేసుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 4, 2024 / 05:33 PM IST

    UK

    Follow us on

    UK: మృత్యువు ఎలా కబలిస్తుందో ఎవరు చెప్పలేం. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందుతున్న వారు ఎంతోమంది. అప్పటివరకు చలాకీగా ఉంటూ గుండెపోటు గురై మరణిస్తున్నారు. కొందరు సకాలంలో స్పందించి ఆసుపత్రిలో చేర్చుతుండడంతో ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ మృత్యువు అంచు వరకు వెళ్లి బతికిన వారిని అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి. ఓ మహిళ అయితే చనిపోయిన 40 నిమిషాల తర్వాత బతికి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

    యూకే లోని నార్త్ యార్క్ షైర్ లో ఓ ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. క్రిస్ట్రీ బార్తో ఫాట్ అనే వివాహిత తన భర్త స్టూతో కలిసి లగ్జరీ నైట్ కు ప్లాన్ చేసుకుంది. అక్కడ క్రిస్టీ సడన్గా సోఫాలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన భర్త హాస్పెటల్ కు తరలించి చికిత్స అందించాడు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు కార్డియాక్ అరెస్టు వంటి సీరియస్ సమస్యకు లోనైనట్లు గుర్తించారు. దీంతో టాబ్లెట్స్ ఇచ్చి కోమాలోకి పంపారు. ఆమె బతకదని భావించి అంత్యక్రియలుకు ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే అక్కడకు 40 నిమిషాల తర్వాత క్రీస్టీ పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపడిపోయారు. ప్రస్తుతం ఆమె భర్తతో ఆనందంగా గడుపుతోంది.

    ఈ ఘటన తరువాత క్రిస్టీ చనిపోయినప్పుడు ఏం జరిగిందో చెబుతూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆరోజు నా ఆత్మ నా సోదరితో టచ్ లోకి వెళ్లిందని… ఇక్కడ పరిస్థితిని తెలుసుకుందని… నా ఆత్మ ప్రబోధానుసారం నా శరీరంలోకి తిరిగి వెళ్ళానని చెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. చనిపోయి మళ్లీ బతకడం ఏమిటని విచిత్రంగా అడుగుతున్నారు. అయితే వింతగా ఉన్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.