Dating For IPhones: ఆమె అందంగా ఉంటుంది. చలాకీగా మాట్లాడుతుంది. పైగా ఉన్నత విద్యావంతురాలు. ఆమె తన తెలితేటలను మంచికి వాడుకుంటే బాగుండేది. కానీ ఆమె గుణం అలాంటిది కాదు. కష్టపడి పని చేయాలనే తలంపు ఆమెలో ఏమాత్రం ఉండదు. ప్రతీది కూడా కష్టపడకుండా కాళ్ల దగ్గరికి రావాలనే తత్వం ఆమెది. అందువల్లే ఆమెకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనను అమలు పెట్టింది. అది ఆమెను జైలు పాలు చేసింది.
Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్
జ్యోతి పేరు జియోలి.. వయసు పాతిక సంవత్సరాల దాకా ఉంటుంది. చూసేందుకు అందంగా ఉంటుంది. ఆమె మాట తీరు కూడా అందానికి తగ్గట్టుగానే ఉంటుంది. అందువల్లే ఆమెతో మాట్లాడేందుకు యువకులు పోటీపడేవారు. ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకున్న ఆమె.. తన బుర్రకు పదును పెట్టింది. తనతో మాట్లాడే మగవాళ్ళల్లో డబ్బున్న వారిని చూసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ మొదలు పెట్టింది. ఇలా ఏకకాలంలో 20 మందిని లైన్ లో పెట్టింది. తన అవసరాలు వారితో తీర్చుకుంది. ఖరీదైన వస్తువులు కొనిపించుకుంది. ఒక్కొక్కరితో ఐఫోన్ 7 సిరీస్ ఫోన్లను ఖరీదు చేయించింది. మొత్తంగా 20 ఫోన్ లను తన సొంతం చేసుకుంది. అయితే ఈ ఫోన్లను ఒక రీసైకిల్ కంపెనీకి విక్రయించింది. తద్వారా ఆమెకు 17 వేల డాలర్లు లభించాయి. తద్వారా ఆ డబ్బుతో తన నూతన ఇంటికి సంబంధించిన డౌన్ పేమెంట్ కట్టింది.
ఎప్పుడైతే ఐఫోన్లు వారి దగ్గర నుంచి స్వీకరించిందో.. పూర్తిగా మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెతో మాట్లాడేందుకు యువకులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆ బృందంలో ఒక యువకుడు ఆమె ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడ పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంది. ఆ తర్వాత ఆమెను నిలదీశాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. ఆ తర్వాత ఆమె చేసిన మోసం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు..” నేను అందంగా ఉంటాను. అందువల్లే మీరు నా వెంట పడ్డారు. నేను మీలో డబ్బును మాత్రమే చూశాను. మీ డబ్బు మాత్రమే నాకు కావాలి.. మీ డబ్బు తీసుకున్నాను. నా అవసరాలు తీర్చుకున్నాను. అంతే అంతకుమించి ఏమీ లేదని” ఆ యువతీ తేల్చి చెప్పడంతో ఆ యువకుడు నిరాశతో బయటికి వచ్చాడు.. ఆ తర్వాత ఈ విషయం బయటికి పొక్కడంతో మిగతా 19 మంది కూడా తమ మోసపోయామని బాధపడ్డారు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి తమలో తామే కుమిలిపోయారు.. అయితే ఈ యువతి చేసిన నిర్వాకం చైనాలో సంచలనం సృష్టించింది.