Homeటాప్ స్టోరీస్Mysore Sandal Soap History: మొదటి ప్రపంచ యుద్ధం, Mysore sandal సోప్ కు సంబంధమేంటి?

Mysore Sandal Soap History: మొదటి ప్రపంచ యుద్ధం, Mysore sandal సోప్ కు సంబంధమేంటి?

Mysore Sandal Soap History: ప్రపంచంలో గంధపు చెక్కల తైలంతో తయారయ్యేది సోప్ మైసూర్ శాండల్ మాత్రమే. అద్భుతమైన సుగంధంతో.. అంతకుమించిన నాణ్యతతో ఈ సబ్బు కోట్లాదిమంది వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సబ్బును గంధపు చెట్ల కొమ్మ అని పిలుస్తుంటారు. అయితే ఇది సాధారణమైన సబ్బు కాదు.. ఈ సబ్బు వెనుక గొప్ప చరిత్ర ఉంది.

Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్

1918 లో మైసూర్ శాండల్ పుట్టింది. దీని పుట్టుక వెనక ఒక బలమైన కారణం ఉంది.. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కర్ణాటక ప్రాంతంలో విపరీతంగా గంధపు చెట్ల కలప మిగిలింది.. నాటి యుద్ధం వల్ల గంధపుచెక్క ఎగుమతులు నిలిచిపోయాయి. యుద్ధం ముగిసినప్పటికీ ఎగుమతులలో కదలిక లేకపోవడంతో కృష్ణరాజు వడయార్ -IV, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక సబ్బును తీసుకురావాలని ప్రతిపాదించారు. 1916లో సబ్బును తీసుకురావాలని నిర్ణయించుకొని.. రెండు సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసి 1918లో మైసూర్ శాండల్ బ్రాండ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ బ్రాండ్ విలువ అంతకంతకు పెరుగుతూనే ఉంది. పైగా ఈ సబ్బు కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారవుతోంది. ఈ సబ్బు పరిమాణం.. ప్యాకింగ్ మొత్తాన్ని గార్లపురి శాస్త్రి రూపొందించారు. నాటి నుంచి అదే కొలతల్లో, అదే ప్యాకింగ్ లో ఈ సబ్బు మార్కెట్లో లభ్యమవుతోంది. అండం ఆకారంలో సబ్బు, నగలు భద్రపరచుకొనే పెట్టే మాదిరిగా ప్యాకింగ్.. దానిపైన కర్ణాటక శరభ ఏనుగు చిత్రం.. ఇవన్నీ కూడా గార్లపురి శాస్త్రి రూపొందించారు.

ఈ సబ్బుకు 2006లో టీమిండియా క్రికెటర్ ధోని తొలి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఈ సబ్బు విక్రయాలు మరింత పెరిగాయి. లోకల్ బ్రాండ్ నుంచి ఈ సబ్బు ఇంటర్నేషనల్ బ్రాండ్ గా ఎదిగింది. 2024 నుంచి తమన్న ఈ సభకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. బ్రాండ్ విలువ పెరిగిన తర్వాత హ్యాండ్ వాష్, షవర్ జెల్, డిటర్జెంట్స్, ధూపం బత్తులను ఈ సంస్థను తయారు చేస్తోంది. అంతేకాదు 15 దేశాలకు మైసూర్ శాండల్ బ్రాండ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17 88 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 416 కోట్లు లాభంగా వచ్చింది. ప్రతి ఏడాది నెట్ ప్రాఫిట్ 45% కంటే ఎక్కువగా నమోదవుతుంది. పైసా శాండల్ బ్రాండ్ ఉత్పత్తులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 85% విక్రయవుతున్నాయంటే.. సౌత్ ఇండియాలో ఈ బ్రాండ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular