Comedian Ali: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ ఘనంగా జరుపుకుంటారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. పండగవేళ అద్భుతమైన రుచులతో కూడిన వంటకాలు చేస్తారు. నటుడు అలీ కుటుంబ సభ్యులతో రంజాన్ ఘనంగా జరుపుకుంటున్నారు. అలీ ఇంట్లో రంజాన్ వేడుకల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలీ వైఫ్ జుబేదా బేగం ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆసక్తికర సంగతులు బయటకు వచ్చాయి. రంజాన్ వేళ పాయసం చేయడం ఆనవాయితీ. ఈ పాయసంలోకి వాడే సేమియాను స్వయంగా ఇంట్లో తయారు చేస్తారు.
అలీ పాయసానికి కావలసిన సేమియా తయారు చేశారు. భార్య పిల్లలతో కలిసి అలీ వంటలు చేశారు. ఆయన షూటింగ్స్ కి కూడా సెలవిచ్చి కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. అలీ సేమియా తయారు చేస్తున్న వీడియో చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలం తర్వాత అలీ హీరోగా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ తో ఓ చిత్రం చేశారు. సీనియర్ నరేష్ మరో కీలక రోల్ చేశారు. ఆహాలో నేరుగా విడుదలైన ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది.
కమెడియన్ గా అలీ సినిమాలు తగ్గించారు. ఆయన రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా ఉంటున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించింది. 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. కాగా గత ఏడాది అలీ కూతురు పెళ్లి ఘనంగా చేశారు. లండన్ లో స్థిరపడిన గుంటూరుకు చెందిన కుర్రాడిని అల్లుడిగా తెచ్చుకున్నాడు.
హైదరాబాద్ లో అలీ కూతురు వివాహం జరిగింది. అనంతరం గుంటూరులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలను అలీ ఖండించారు. పెళ్లికి పిలవడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ నాతో పది నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్లయిట్ మిస్సవడంతో పెళ్లికి రాలేకపోయాడంటూ వివరణ ఇచ్చారు. రాజకీయాల కారణంగా పవన్-అలీ మధ్య దూరం పెరిగిందన్న వాదన ఉంది.