Rajasthan: తన ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో ఇల్లు నిర్మించుకున్నాడు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాడు. వారు కూడా జీవితంలో స్థిరపడ్డారు. భార్యతో కలిసి రిటర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న అతడికి అనుకోని షాక్ తగిలింది. తన భార్య అనారోగ్యానికి గురైంది. ఎన్ని ఆస్పత్రులు చూపించినా ఆమెకు నయం కాలేదు. పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడటంతో.. ఆమెకు సపర్యలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే తను చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని భావించాడు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేశాడు. ప్రభుత్వం కూడా అతడి ఆవేదనను అర్థం చేసుకొని స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పుకుంది. అతడికి రావాల్సిన ప్రయోజనాలను కూడా అందించింది. అతడు పనిచేస్తున్న శాఖ సిబ్బంది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి దేవేంద్ర సతీమణి కూడా హాజరైంది. ఆ కార్యక్రమంలో దేవేంద్ర గురించి తోటి ఉద్యోగులు గొప్పగా చెప్పారు. అతని ఉద్యోగ నిరతి గురించి వివరించారు. తన భర్త గొప్పతనాన్ని చూసి అతడి భార్య ఉప్పొంగిపోయింది. కొన్నిసార్లు కన్నీరు ఒలికించింది. అది చూసి దేవేంద్ర కూడా పొంగిపోయాడు.. తన భార్యను సంతోషపరిచే సందర్భం వచ్చిందని మురిసిపోయాడు. అయితే అతడు ఊహించని దారుణం అక్కడ చోటుచేసుకుంది.
కన్ను మూసింది
భార్య కోసం మూడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే దేవేంద్ర తన ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేశాడు. తన భార్య సమక్షంలో రిటర్మెంట్ ఫంక్షన్ కూడా చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన భార్య తో సరదాగా గడుపుతున్నాడు.. ఈ క్రమంలోనే దేవేంద్ర సతీమణి ఉన్నట్టుండి కింద పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కన్నుమూశారని వైద్యులు చెప్పారు. దీంతో దేవేంద్ర శోకసంద్రంలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు..” దేవేంద్ర తన భార్య కోసం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశాడు. మూడు సంవత్సరాల సర్వీసు ఉండగానే వదులుకున్నాడు. భార్యతో ఉండాలని భావించాడు. ఆమెకు సపర్యలు చేయాలని.. ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాలని భావించాడు. అతడు ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది. దేవేంద్ర చూస్తుండగానే అతని భార్య కన్ను మూసింది. ఇంతకంటే దారుణం ఏ మగవాడి జీవితంలో చోటు చేసుకోకూడదు. ఉద్యోగం కోల్పోయి.. భార్యనూ కోల్పోయి దేవేంద్ర నరకం చూస్తున్నాడు అంటూ” తోటి ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, తన భార్య కన్ను మూయడంతో దేవేంద్ర కంటికి ధారగా వినిపిస్తున్నాడు.. తనలాంటి కష్టం మరొకరికి రాదని బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అదే తీరుగా విలపించడం బంధువుల కంట నీరు తెప్పిస్తోంది.
రాజస్థాన్ కు చెందిన దేవేంద్ర సండాల్ ప్రభుత్వ ఉద్యోగి. అతడికింకా మూడు ఏళ్ల సర్వీస్ ఉంది. భార్యకు అనారోగ్యంగా ఉండడం.. ఆమెకు సపర్యలు చేసేందుకు VRS తీసుకున్నాడు. దానికి సంబంధించి సన్మాన సభ ఏర్పాటు చేయగా.. అందులోనే ఆమె భార్య ప్రాణాలు విడిచింది. #Rajasthan #Devendrasandal pic.twitter.com/ZH3wcESPJe
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024