Homeఎంటర్టైన్మెంట్Raja Deluxe Movie: రాజా డీలక్స్ లో ప్రభాస్ ఇలా ఉన్నాడేంటీ? పాన్ ఇండియా స్టార్...

Raja Deluxe Movie: రాజా డీలక్స్ లో ప్రభాస్ ఇలా ఉన్నాడేంటీ? పాన్ ఇండియా స్టార్ పక్క ఆ హీరోయినా!

Raja Deluxe Movie: ఒకటికి మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద పెట్టాడు ప్రభాస్. ఆది పురుష్ తో కూడా కలుపుకుంటే నాలుగు చిత్రాలు. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. జూన్ నెలలో విడుదల కానుంది. ప్రాజెక్ట్ కే, సలార్, రాజా డీలక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటిలో ఆదిపురుష్ మూవీ మీద అసలు అంచనాలు లేవు. కనీసం ఫ్యాన్స్ కూడా ఆ మూవీ కోసం ఎదురుచూడటం లేదు. టీజర్ చూసి వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేశారు. దానికి తోడు వివాదాలు, ప్రాజెక్ట్ మీద హైప్ పోయేలా చేశాయి. ఆదిపురుష్ రూపంలో ప్రభాస్ మరో ప్లాప్ చూడబోతున్నాడని పలువురి వాదన.

ఆదిపురుష్ తో పాటు రాజా డీలక్స్ మీద కూడా అంచనాలు లేవు. నిజానికి ఈ ప్రాజెక్ట్ వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు తెరకెక్కించిన సుజీత్, రాధాకృష్ణలకు అనుభవం లేదు. అందుకే ప్రభాస్ వంటి టాప్ స్టార్ ని సరిగా ప్రజెంట్ చేయలేకపోయారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దర్శకుడు మారుతికి ఆఫర్ ఇవ్వడం అవసరమా అని పెదవి విరిచారు.

మారుతి ఇంతవరకు ఒక్క స్టార్ హీరోతో మూవీ చేయలేదు. అలాగే ఆయన ట్రాక్ కూడా బాగోలేదు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ ప్లాప్ అయ్యాయి. ఆయన ట్రాక్ కూడా సరిగా లేదు. మారుతి ప్రాజెక్ట్ చేయకండని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. ప్రభాస్ ఇంట్రెస్ట్ ఏమిటో తెలియదు కానీ… మారుతికి ఆఫర్ ఇచ్చారు. రాజా డీలక్స్ షూటింగ్ కూడా మొదలైపోయింది.

Raja Deluxe Movie
Raja Deluxe Movie

రాజా డీలక్స్ షూటింగ్ దాదాపు సెట్స్ లో పూర్తి చేయనున్నారట. అనూహ్యంగా ఇది కామెడీ హారర్ మూవీ అంటున్నారు. ఈ జోనర్ ప్రభాస్ కి ఎలా సెట్ అవుతుందనే ఓ వాదన ఉంది. కాగా రాజా డీలక్స్ మూవీకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ కొంచెం భిన్నంగా ఉంది. బాగా గడ్డం, జుట్టు పెంచుకుని ఉన్నాడు. ప్రభాస్ పక్కన హీరోయిన్ రిద్దీ కుమార్ ఉంది. అంత పెద్ద స్టార్ పక్కన రిద్దీ కుమార్ ఏంటని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ మరో ఇద్దరు హీరోయిన్స్ అట. మారుతి రాజా డీలక్స్ పేరుతో వండుతున్న ఈ కిచిడీ టేస్ట్ ఎలా ఉండనుందో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper