https://oktelugu.com/

Bungee Jumping: భార్యతో విడాకులు వచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు!

బ్రెజిల్‌కు చెందిన రాఫెల్‌ డోస్‌ శాంటోస్‌ తోస్టా(22) వ్యక్తిగత కారణాలతో భార్యతో విడాకులు తీసుకున్నాడు. అనంతరం తనకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఆనందంగా గడపాలనుకున్నాడు. అందులో భాగంగానే భార్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆనందంతో బంగీ జంప్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 9, 2023 / 04:23 PM IST

    Bungee Jumping

    Follow us on

    Bungee Jumping: పెళ్లికి ముందు ఫొటో, వీడియో షూట్‌ చేసుకోవడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. కాబోయే దంపతులు మంచి లొకేషన్లలో హీరో హీరోయిన్లలా షూట్‌ చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఈ ట్రెండ్‌కు తగిట్టే.. మరో ట్రెండ్‌ స్టార్ట్‌ అయింది. పెళ్లి చేసుకుని విడిపోయే జంటలు కూడా డైవర్స్‌ షూట్‌ చేసుకుంటున్నారు. పెళ్లి ఫొటోలు చింపుతూ.. జ్ఞాపకాలు చెరిపేస్తూ షూట్‌ చేస్తున్నారు. తాజాగా ఇక్కడో భర్త భార్య నుంచి విడిపోతున్న ఆనందంతో బంగీ జంప్‌ చేయబోయాడు. అయితే అదికాస్త వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

    విడిపోతున్నామన్న ఆనందంలో..
    బ్రెజిల్‌కు చెందిన రాఫెల్‌ డోస్‌ శాంటోస్‌ తోస్టా(22) వ్యక్తిగత కారణాలతో భార్యతో విడాకులు తీసుకున్నాడు. అనంతరం తనకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఆనందంగా గడపాలనుకున్నాడు. అందులో భాగంగానే భార్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆనందంతో బంగీ జంప్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్‌ స్వింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. ఆనందంగా 70 అడుగుల ఎత్తు నుంచి జంప్‌ చేశాడు. అయితే తాడు తెగిపోవడంతో రాఫెల్‌ కిందనున్న నీటి కొలనులో పడిపోయాడు.

    చావు తప్పి ఆస్పత్రి పాలు..
    అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో మెడ విరగడంతోపాటు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో చావు తప్పి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఇటీవలే అతను కోలుకుని విజయం చెప్పడంతో అసలు నిజం తెలిసింది.

    నెట్టింట్లోల వైరల్‌..
    ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. సంబురం సంగతేమో కానీ చావు తప్పిందిరా నాయనా అని కొందరు.. ఇదేం సెలబ్రేషన్స్‌రా బాబు అని మరికొందరు.. ఇలా కూడా సెలబ్రేట్‌ చేసుకుంటారా అని మరికొందరు కామెంట్స్‌ పెడతున్నారు. కొద్దిలో మిస్సయ్యావ్‌.. లేకుంటే శాశ్వత సెలవు తీసుకునేవాడివి అని పోస్టులు పెడుతున్నారు.