Vishnukanth Samyuktha Divorce: హిందూ సంప్రదాయంలో పెళ్ళికి ఎంతో విలువ ఉంది. కాలం మారే కొద్దీ పెళ్లి అనే బంధం చాలా పలుచబడి పోతుంది. చాలా ఈజీగా జంటలు విడిపోతున్నాయి. విడాకులు ఇచ్చే కోర్టులు, లాయర్ల సంఖ్య అధికమైపోయింది. కారణం ఇదే. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి వంద జంటల్లో ఒకరు కచ్చితంగా విడాకులు తీసుకుంటున్నారు. సర్దుకుపోయే మనస్తత్వం అనేది జనాల్లో దూరమైపోయింది. నచ్చకపోతే ఎవరైనా ఒకటే అంటున్నారు. దూరం పెట్టేస్తున్నారు.
తాజాగా ఓ బుల్లితెర జంట కేవలం వివాహమైన రెండు నెలలకే గుడ్ బై చెప్పుకున్నారు. తమిళ సీరియల్ యాక్టర్స్ గా ఉన్న విష్ణుకాంత్, సంయుక్త విడాకులు తీసుకున్నారు. తమిళ సీరియల్ ‘సిప్పి నీల్ ముత్తు’ . ఈ సీరియల్ లో హీరో హీరోయిన్ గా సంయుక్త, విష్ణుకాంత్ నటించారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2021 మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
పట్టుమని పది రోజులు గడవకుండానే విష్ణుకాంత్-సంయుక్త మధ్య మనస్పర్థలు తలెత్తాయట. దాంతో బ్రేకప్ చెపుకున్నారట. విష్ణుకాంత్-సంయుక్త విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కోర్టు కూడా భార్యాభర్తలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇద్దరికీ ఇష్టమైన ఎలాంటి కాల పరిమితులు లేకుండా విడాకులు ఇవ్వొచ్చంటూ తీర్పు వెలువరించింది. కాబట్టి పెళ్ళై రెండు నెలలే అవుతున్నప్పటికీ విష్ణుకాంత్, సంయుక్త విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు బ్రతకవచ్చు.
ఏళ్ల తరబడి డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లయ్యాక మాత్రం రోజుల వ్యవధిలో విడాకులు తీసుకున్నారు. వీరి అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడిపోకుండా ఉండాల్సింది అంటూ వాపోతున్నారు. కొందరేమో పెళ్లంటే ఎగతాళి అయిపోయింది. చిన్న కారణాలకు కూడా విడిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.