https://oktelugu.com/

Lion: వైరల్ వీడియో: నడివీధిలో సింహం మిడ్ నైట్ వాక్

మనదేశంలో ఉత్తర ప్రాంతంలో సర్కస్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటలీ దేశంలో సర్కస్లు సర్వసాధారణం. అందులో పేరు పొందిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు. కేవలం ఈ సర్కస్లు చూసేందుకే ఇటలీ దేశానికి ప్రతీ సంవత్సరం లక్షల మంది యాత్రికులు వెళ్తుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 16, 2023 / 12:09 PM IST

    Lion

    Follow us on

    Lion: డిస్కవరీలో జింకను వేటాడుతున్న సింహాన్ని చూస్తే వణికి పోతాం. ఫలానా చోట సింహం ఏదో ఒక జంతువును వేటాడింది అని వార్తాపత్రికల్లో చదువుతుంటే భయపడిపోతాం. అక్కడిదాకా ఎందుకు గంభీరమైన సింహం ఫోటోను చూసినా ఆందోళన చెందుతాం. కానీ అలాంటి సింహం దర్జాగా నడివీధిలో నడుచుకుంటూ వెళుతున్న వీడియో మీరు ఎప్పుడైనా చూశారా? అడవిలో ఉండాల్సిన సింహం పౌరుషంగా తన గమనాన్ని సాగించడం మీరెప్పుడైనా తిలకించారా? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఇంతకీ ఏమిటి ఆ సింహం? ఎక్కడ జరిగింది ఈ వ్యవహారం? తెలుసుకోవాలంటే చదివేయండి ఈ కథనం.

    ఇటలీ దేశంలో..

    మనదేశంలో ఉత్తర ప్రాంతంలో సర్కస్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటలీ దేశంలో సర్కస్లు సర్వసాధారణం. అందులో పేరు పొందిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు. కేవలం ఈ సర్కస్లు చూసేందుకే ఇటలీ దేశానికి ప్రతీ సంవత్సరం లక్షల మంది యాత్రికులు వెళ్తుంటారు. ఇలా సర్కస్ల ద్వారా ఇటలీ దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరుతూ ఉంటుంది. అక్కడి ప్రభుత్వం కూడా సర్కస్లు చేసే వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తుంది. అయితే ఇలాంటి సర్కస్లలో కొన్ని కంపెనీలు జంతువులతో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదర్శన చూసేందుకు అక్కడి ప్రజలు మాత్రమే కాదు ఇతర దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ సర్కస్ కంపెనీ చేసిన విన్యాసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    సింహం బయటకు వచ్చింది

    ఇటలీలోని ఒక పెద్ద సర్కస్ కంపెనీ జంతువులతో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఆ కంపెనీ భారీ స్థాయిలో జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన కళాకారులు జంతువులతో ప్రదర్శన నిర్వహిస్తుండగా బోనులో బంధించి ఉన్న సింహం అనుకోకుండా బయటికి వచ్చింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రాంతంలో భారీగా జనం ఉండడంతో ఆ అరుపులకు భయపడిపోయి వేరే ప్రాంతానికి పరుగులు తీసింది. అప్పటికి అర్థరాత్రి కావడంతో రోడ్డుమీద జన సంచారం లేదు. ఇన్నాళ్లు బోనులో చిక్కి ఉన్న సింహం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ బయటికి నడక ప్రారంభించింది.. అయితే సింహం అర్థరాత్రి పూట అలా నడుచుకుంటూ వెళుతున్న తీరును కొంతమంది ఔత్సాహికులు వీడియో తీశారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అర్ధరాత్రి పూట సింహం నడివీధిలో వాకింగ్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.