Lakshmi Manchu: ఈ వయసులో అలాంటి ఫోజులు.. మంచు లక్ష్మీ హాట్ ఫొటోలు వైరల్

ఒక్కోసారి ఆమె తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో ఆమెదే ప్రధాన పాత్ర. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : November 16, 2023 12:05 pm

Lakshmi Manchu

Follow us on

Lakshmi Manchu: హీరోయిన్ కావాలన్న ఆశలు మంచు లక్ష్మిలో ఇంకా సన్నగిల్లలేదు. అందుకేనేమో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. మోహన్ బాబు వారసురాలైన మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది. టెలివిజన్ హోస్ట్ గా పలు ఇంగ్లీష్ షోస్ హోస్ట్ చేసింది. అలాగే రెండు మూడు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. సడన్ గా మకాం మార్చి ఇండియాకు వచ్చేసింది. సిద్ధార్థ-శృతి హాసన్ జంటగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగిటివ్ రోల్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్.

తర్వాత గుండెల్లో గోదారి, దొంగ, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. మరోవైపు కొన్ని చిత్రాలు ప్రొడ్యూస్ చేసింది. తెలుగులో టాక్ షోలకు హోస్ట్ గా చేసింది. ఏం చేసిన మంచు లక్ష్మికి జనాల్లో క్రేజ్ ఫేమ్ రాలేదు. దానికి తోడు విపరీతమైన ట్రోలింగ్ ఆమెపై నడుస్తుంది. మంచు లక్ష్మి తెలుగు మాట్లాడే తీరు పలుమార్లు నవ్వులపాలు చేసింది.

ఒక్కోసారి ఆమె తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో ఆమెదే ప్రధాన పాత్ర. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. ఎందుకో విడుదలకు నోచుకోవడం లేదు. అగ్ని నక్షత్రం విడుదల కష్టాలకు గురి అవుతుందనే పుకార్లు ఉన్నాయి. ఈ మూవీలో మోహన్ బాబు కూడా ఓ పాత్ర చేశారట.

మరోవైపు మంచు ఫ్యామిలీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు… మంచు లక్ష్మి, మనోజ్ మరోవైపు చేరారు. ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు తలెత్తాయనే వాదనలు ఉన్నాయి. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు లక్ష్మి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. 46 ఏళ్ల మంచు లక్ష్మి ఇప్పటికీ గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తూ షాక్ ఇస్తుంది. తాజాగా చోళీ లెహంగాలో నెటిజెన్స్ మనసులు దోచేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.