Revanth Reddy Meet Chandrababu: తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రచారంలో దూకుడు పెంచుతుండగా, కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా దూసుకువస్తోంది. బీజేపీ కాస్త వెనుకబడే ఉంది. ఈ తరుణంలో రాజకీయాల్లో ఇంకా చేరికలు, రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాగా కాంగ్రెస్‌కు అనిల్ రాజీనామా చేయగా, బీజేపీకి విజయశాంతి గుడ్‌బై చెప్పారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌కు సీపీఐ, తెలంగాణ జన సమితి మద్దతు ఇచ్చాయి. తాజాగా టీడీపీ కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. ఇందుకు కృతజ్ఞతగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.
బెయిల్‌పై ఉన్న బాబు..
ఏపీ స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ పొదారు. ఇటీవలే కంటి ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు ఉండగా ఆయన్ని పరామర్శించడంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు రేవంత్‌రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది.
శిష్యునికి దిశానిర్దేశం..
ఇటీవల అర్ధ్థరాత్రి వేళ రేవంత్ చంద్రబాబులో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాబు.. తన శిష్యుడికి తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం. కేసీఆర్ బలాలు, బలహీనతల గురించి కూడా రేవంత్‌కు తెలిపారని టాక్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో అది టీడీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.
తెలంగాణ ఎన్నికలకు దూరం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో పోటీ చేయకపోవడమే మేలని భావించిన చంద్రబాబు నాయకుడు ఎన్నికల్లో పోటికి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుందని రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన – బీజేపీ కూటమికి టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు జై కొట్టారు. సెటిలర్ల ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మరల్చడంతోపాటు తన శిష్యుడుని సీఎంగా చేసేందుకు ఇది దోహదపడుతుందని బాబు భావించారని సమాచారం.
రేవంత్ బాబు భేటీ జరిగిందన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి తెలంగాణ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీడీపీ కాంగ్రెస్ గెలుపుకోసం ఇకపై బహిరంగంగానే ప్రచారం నిర్వహించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.